నేటితో భారత దేశంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన్ కేంద్రం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారత దేశంలో మొదటి కృషి విజ్ఞాన్ కేంద్రం మార్చ్ 21 1974, పుదుచ్చేరిలో స్థాపించబడింది. కనుక ఈ రోజు పుదుచ్చేరి కృషి విజ్ఞాన్ కేంద్రంలో స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పేరుంతైలవర్ కామరాజ్ కేవీకే, పుదుచ్చేరి వేదికగా ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకులను పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ICAR) కలిసికట్టుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డా. శరత్ చౌహన్(పుదుచ్చేరి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ), డా. యూ.స్ గౌతమ్(అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్), డా. సంజయ్ కుమార్ సింగ్ డిడిజి, హార్టికల్చర్, మరియు తదితరులు పాల్గొన్నారు. డా. శరత్ చౌహన్, దీపాన్ని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డా. ఎస్ వసంత కుమార్ మాట్లాడుతూ, ప్రారంభించిన నాటినుండి కృషి విజ్ఞాన్ కేంద్రాలు ఎంతో ప్రగతిని సంతరించుకున్నాయి అని ప్రసంగించారు. 1974 లో ఒక్క కేవీకే గా మొదలై, ఇప్పుడు ఏకంగా 731 కేవీకే ల వరకు చేరుకున్నాయని, భవిష్యత్తులో మరింత పెరుగుతాయని నమ్మకం వ్యక్తం చేసారు. భారత దేశంలోని ప్రతీ జిల్లాలో రైతులకు కొత్త విజ్ఞానం పై అవగాహన కల్పించడంలో ఎంతగానో దోహదపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేసారు. తర్వాత ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. యూఎస్ గౌతమ్ మాట్లాడుతూ, భారత దేశం వికసిత్ భరత్ కలను నిజం చేయడంలో కృషి విజ్ఞాన్ కేంద్రాలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. కేవీకేలు చిన్న పాటి యూనివర్సిటీ లాగా వ్యవహరిస్తూ రైతులకు, మహిళలకు వ్యవసాయంలో వస్తున్న కొత్త మెళుకువలను నేర్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అలాగే యువత అగ్రిస్టార్టుప్స్ మొదలుపెట్టడంలో ఎంతగానో సాయంచేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేసారు. అంతేకాకూండా రానున్న రెండేళ్లలో మరో 121 కృషి విజ్ఞాన్ కేంద్రాలు స్థాపించేందుకు యోచన చేస్తున్నట్లు తెలియజేసారు. తద్వారా అగ్రికల్చర్ విద్యార్ధ్యులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించ్చవచ్చని తెలిపారు.
Breaking News: వరుస భూకంపాలతో భయబ్రాంతులకు గురైన ప్రజలు:
కృషి విజ్ఞాన్ కేంద్ర స్థాపక దినోత్సవం:
కృషి విజ్ఞాన్ కేంద్రాలు, కేవలం వ్యవసాయ అభివృద్ధికే కాకుండా వ్యవసాయ అనుబంధ సంస్థలైన, పశువుల పెంపకం, చేపలు మరియు రొయ్యల పెంపకం, ఉద్యాన పంటల యాజమాన్యం, ఇలా అన్ని రకాల రంగాల అభివృధికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రారంభించిన నాటినుండి కృషి విజ్ఞాన్ కేంద్రలు ఎంతో విశిష్టతను, రైతుల్లో మంచి పేరును సంతరించుకున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కేవీకేలో అన్ని వ్యవసాయ శాఖల అధికారులు అందుబాటులో ఉండటం ద్వారా, రైతులు తమ సందేహాలను, నివృత్తి చేసుకునేందుకు సులువుగా ఉంటుంది. వ్యవసాయ స్టార్ట్-అప్ కంపెనీలు మొదలు పెట్టడానికి అవసరమైన శిక్షణను, మరియు పెట్టుబడని అందించి, వ్యవసాయ రంగానికి ఎంతో సహాయం చేస్తుంది.
Share your comments