ఒక్కపుడు ఎకరం భూమి కొనాలంటే వేలల్లో లేదా రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం ఐతే రాష్ట్రంలోని మూల ప్రదేశాల్లో కూడా భూమి కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాధారణ ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలాఉంటే, ఇక హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల వద్ద భూమి కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే.
ఇటీవల కోకాపేట భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నియోపోలిస్ లేఅవుట్‌లో ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్‌ఎండీఏకు కోకాపేటకు చెందిన నియో పోలిస్ ఫేస్-2లోని భూములు కోట్లు కురిపించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేటకు చెందిన నియో పోలిస్‌లో రూ.35 కోట్ల ధరను ఒక ఎకరం భూమికి నిర్ణయించారు. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి.
హెచ్‌ఎండీఏ ఇదే లేఅవుట్‌లో ఇంతకుముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.60 కోట్ల రేటు పలకగా.. గురువారం నాటి రెండోదశ దాన్ని మించిపోయింది. ఈ గురువారం వేలంలో ఎకరం భూమికి అత్యధికంగా ధర రూ. 100 కోట్లు పలికింది. ఈ ధరలు ఇంతలా పలకడంతో అంతర్జాతీయంగా కూడా హైదరాబాద్ చర్చనీయాంశంగా మారింది అని అంటున్నారు.
ఇది కూడా చదవండి..
చుండ్రు సమస్య ఎక్కువగా ఉందా? అయితే ఈ సహజసిద్ధమైన పద్ధతులను పాటించండి
గురువారం ఉదయం మొదటి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా మొత్తానికి నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం లభించింది. మొత్తానికి గురువారం ఉదయానికి 26.86 ఎకరాలకు వేలం పూర్తి అయ్యింది. 10,11,14 నెంబరు ప్లాట్లకు గురువారం సాయంత్రం నుండి వేలం నిర్వహించారు. వీటిలో 10వ నెంబరు ప్లాట్‌కు అత్యధికంగా రూ.100 కోట్ల ధర పలికింది.
ఈ 10వ నెంబరు ప్లాట్‌కు వెనక వైపు నుంచి గండిపేట చెరువు మరియు ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఈ ప్లాట్‌కు పోటాపోటీ వేలం జరిగిందని చెబుతున్నారు. గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది.
ఇది కూడా చదవండి..
Share your comments