భూమిపైనా కాకుండా వేరే గ్రహాల పైన జీవరాసులు ఉన్నాయా అని ఆలోచిస్తాం. కానీ మనకు భూమిపైన ఉన్న సముద్రంలో ఉండే జీవరాసుల గురించి తెలియదు. ఈ సముద్రపు లోతైన నీటిలో మనకు కనబడని ఎన్నో జీవరాసులు ఉంటాయి. కొన్ని జీవరాసులు మన కంటికి కనబడే విధంగా పైన నివసిస్తే మరికొన్ని సముద్రం అంచుల్లో జీవిస్తాయి. సముద్రంలో జీవరాసుల గురించి ఎంత అన్వేషించిన ఇంకా తెలియనివి ఉంటూనే ఉంటాయి.
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే చేప అంత్యంత విలువైన చేపల్లో ఒకటి. ఈ చేప ప్రపంచంలోనే అంత్యంత ఖరీదైన చేప. కానీ ప్రస్తుతం ఈ చేప అంతరించిపోయే దశలో ఉంది. ఈ చేపని ఎవరు వేటాడకూడదు మరియు తినకూడదు కూడా. ఒకవేళ ఈ చేపని ఎవరైనా వేటాడితే లేదా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆలా ప్రయతించిన వారికి లేదా వేటాడిన వారికి కఠిన కారాగార శిక్షను ప్రభుత్వం వేస్తుంది.
ఈ అత్యంత ఖరీదైన చేప పేరు అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా. ఈ చేపను చుసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోతారు. సుమారుగా రూ.23 కోట్ల ఖరీదు చేసే ప్రపంచంలోనే అత్యంత విలువైన చేపగా పేరు తెచ్చుకుంది. 2020లో ఈ చేపను రూ. 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ చేప చాలా పెద్దది. మరియు ఇది టార్పెడో ఆకారంలో ఉంటుంది. దీనికి ఉన్న ఈ అక్కారం కారణంగా అట్లాంటిక్ బ్లూఫిన్ ట్యూనా సముద్రంలో చాలా ఎక్కువ దూరం ఎక్కువగా వేగంతో వెళ్తుంది.
ఇది కూడా చదవండి..
ఆధార్ కార్డు ఉంటే చాలు.. 5 నిమిషాల్లో రూ.2 లక్షల వరకు లోన్ పొందవచ్చు
ఈ చేప యొక్క బరువు సుమారుగా 250 కిలోల వరకు ఉంటుంది. మరియు ఈ చేప 3మీటర్లు పొడవు పెరుగుతుంది. మనుషులకు ఈ చేపల కారణంగా ఎటువంటి హాని ఉండదు. పైగా ఈ చేపల్లో ఎక్కువగా ప్రొటీన్ మరియు ఒమేగా-3 కంటెంట్ ఉంటుంది. వీటిని పరిశోధకులు ఔషధాలను తయారీ చేయడానికి బాగా వాడతారు.
ఈ చేపలకు ఉన్న డిమాండ్ కారణంగా సముద్రాల్లో వేటగాళ్లు ఓవర్ ఫిషింగ్ చేస్తున్నారు. దీని కారణంగా సముద్రాల్లో ఈ చేయాలా సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ చేపలను అంతరించిపోకుండా కాపాడేందుకు బ్రిటన్ ప్రభుత్వం సముద్రంలో ఈ చేపల వేటను నిషేదించింది. ఎవరైనా ఈ చేపలను వేటాడితే జరిమానాలు, జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments