గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనీ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వరద నీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు.ఈ విధంగా వరదనీరు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో చెరువులో ఉన్నటువంటి చేపలు రోడ్డుపైకి కొట్టుకు వచ్చాయి. దీంతో ఆ చేపలను పట్టుకోవడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
అధికంగా వర్షపాతం నమోదు కావడం చేత నిర్మల్ జిల్లా నీటి సంద్రమైంది. పెద్ద ఎత్తున వరద నీళ్లు రోడ్లపైకి రావడం చేత రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చెరువులలో ఉన్న చేపలు రోడ్లపైకి కొట్టుకు వచ్చాయి. ఈ చేపలను పట్టుకోవడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని దొరికిన వారికి దొరికిన చేపలను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరద నీటిలో కొట్టుకు వచ్చిన చేపలు ఒక్కో చేప సుమారుగా రెండు కిలోల వరకు బరువు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
ప్రస్తుతం స్థానికులు ఈ విధంగా చేపల కోసం ఎగబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా అధిక వర్షపాతం కారణంగా జల సందిగ్ధంలో ఉన్న నిర్మల్ జిల్లాలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను జారీ చేశారు. అదే విధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని బయటకు రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
Share your comments