News

చైనాలో లాంగ్యా వైరస్‌.. అది ప్రమాదకరమా? లక్షణాలు ఇవే!

Srikanth B
Srikanth B

చైనాలో కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. షాన్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో 35 మందికి లాంగ్యా హెనిపావైరస్‌ సోకినట్టు అక్కడి అధికారులు గుర్తించారు.

ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌.. మరి అసలు లాంగ్యా వైరస్‌ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? వైరస్‌ ప్రమాదకరమైనదా? కాదా అనే విషయాలు తెలుసుకుందాం ...

లాంగ్యా వైరస్ 2019లో మొదటిసారిగా మనుషుల్లో గుర్తించారు. కానీ లాంగ్యా వైరస్‌ కేసులు ఈ ఏడాదిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఒకరి నుంచి మరొరరికి సోకుతుందా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చైనా వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా ప్రభావం కనిపించిన 2020 జనవరి-జులై నెలల మధ్యలో లాగ్యా వైరస్ ఇన్ఫెక్షన్లు కనిపించలేదని బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడెమియాలజీ పరిశోధకులు వెల్లడించారు.


లాంగ్యా వైరస్‌ లక్షణాలు
కానీ 2020 జులై తర్వాత 11 లాంగ్యా వైరస్ కేసులను గుర్తించారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలను గమనించిన పరిశోధకులు.. ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు. లాంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, 46 శాతం మందిలో కండరాల నొప్పులు, 38 శాతం మందిలో వాంతులు వంటి లక్షణాలను గుర్తించారు. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు


హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే 262 ష్రూస్‌లపై పరిశోధనలు చేయగా 71 జీవుల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. కుక్కలు (5 శాతం), మేకల్లోనూ (2శాతం) ఈ వైరస్‌ను కనుగొన్నారు. మరో విషయమేంటంటే.. సాధారణంగా గబ్బిలాలలో కనిపించే ప్రాణాంతక నిఫా వైరస్ కుటుంబానికి చెందినదే లాంగ్యా వైరస్‌. నిఫా కోవిడ్-19 తరహాలోనే లాంగ్యా వ్యాపిస్తుందట! అయితే నిఫా వైరస్‌ తదుపరి మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది.

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Share your comments

Subscribe Magazine

More on News

More