ఒకప్పుడు కట్టెల పోయ్యి మీద వంట వండేవారు. కట్టెల పోయ్యి మీద వండే పదార్థాలకు, గ్యాస్ మీద వండే పదార్థాలకు మధ్య రుచిలో తేడా కూడా ఉంటుంది. కట్టెల పోయ్యి మీద వంట చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఏ పదార్థాన్ని వండాలన్నా.. కట్టెల పోయ్యి మీద మాత్రమే వండేవారు. ఒకప్పుడు గ్యాస్ వినియోగం చాలా తక్కువగా ఉండేది. సిటీలు, టౌన్‌లలో మాత్రమే గ్యాస్ వినియోగించేవారు. పల్లెటూర్లలో ఎక్కువగా కట్టెల పోయ్యినే వినియోగించేవారు.
ఒకప్పుడు బాగా ఉన్నవారు మాత్రమే వంట గ్యాస్ వాడేవారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్ వినియోగానికి చాలా దూరంగా ఉండేవారు. ఇప్పటికీ పల్లెటూర్లలో కొంతమంది కట్టెల పోయ్యి మీద వంట వాడేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఆధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి. కట్టెల పోయ్యి పోయి వంట గ్యాస్ వచ్చేసింది.
కట్టెల పోయ్యి మీద వంట చేయాలంటే మంట ఆరిపోకుండా ఊడుదూ ఉండాలి. దీంతో ఆ పోగ వల్ల కళ్ల వెంట నీళ్లు వస్తూ వండటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సిటీలు, పట్టణాలు, విలేజ్‌లు తేడా లేకుండా ప్రతిఒక్కరూ తమ ఇంట్లో వంట గ్యాస్ వాడుతున్నారు.
అయితే వంట గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. గురువారం వంట గ్యాస్ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నెలలో వంట గ్యాస్ ధరలు పెరగడం ఇది మూడోసారి. ఈ నెల 4న రూ.25 పెరగ్గా.. 15వ తేదీన రూ.50 పెరిగింది. తాజాగా రూ.25 పెరిగింది. మొత్తం కలిపితే ఈ నెలలోనే వంట గ్యాస్ ధర ఏకంగా రూ.100 పెరిగింది.
ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.749కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో నిన్న సిలిండర్ ధర రూ.821.50గా ఉంది. కానీ ఇవాళ రూ.25 పెరగడంతో.. రూ.846.50కి చేరుకుంది. ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Share your comments