News

LPG గ్యాస్ ధరలు 50 Rs పెంపు – సామాన్యుడిపై మరో భారం

Sandilya Sharma
Sandilya Sharma
LPG subsidy news - domestic gas price Hike today (Image Courtesy: Google Ai)
LPG subsidy news - domestic gas price Hike today (Image Courtesy: Google Ai)

అసలే రోజువారీ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి అని సామాన్యుడు వాపోతుంటే పిడుగుపాటు లాంటి కొత్త వార్త ఇప్పుడు నెత్తిమీద పడింది. ఇప్పుడు భారతదేశం మొత్తం వంట గ్యాస్ ధర 50 రూపాయిలు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు  LPG సిలిండర్ పై 50 రూపాయిలు అదనంగా కట్టాలిసినట్టు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపై (Ujjwala scheme price) కూడా రూ.50 పెరిగింది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది (common man fuel burden).

ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  రేట్లు తగ్గటంతో దేశంలో కూడ ఇంధనాల ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశపడితే, అదికూడా కాదు అని పెట్రోల్ డీజిల్ మీద కూడా చెరో 2 రూపాయిల ఎక్సయిజ్ డ్యూటీ వేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటికే పాలు, నిత్యావసర వస్తువుల ధరలు అంబరాన్ని తాకుతుంటే ఇప్పుడు ఏప్రిల్ లో ఎల్ పీజీ  గ్యాస్ ధర (LPG price hike April 2025) 50 రూపాయిలు పెరగటడం, సామాన్యుడు గుండెలో గుదిబండలా మారింది. అయితే పెరుగుతున్న ఆర్థికమాంద్యం (fuel inflation India) నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పెంచిన ఈ కొత్త భారత గ్యాస్ ధరలు(gas cylinder new rate India) ఏప్రిల్ 8 నుండి అమలులోకి రానున్నాయి.  

ఈ పెరిగిన కొత్త ధరల ప్రభావంతో (gas price impact)  హోటల్, రెస్టారెంట్లలో ధరలు పెరగబోతున్నాయి. అంతే కాక ప్రొసెస్డ్ ఫుడ్ ధరలు కూడా అంబరాన్ని తాకే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో, బయట తిందాం అని వెళితే జేబుకి చిల్లుబడటం ఖాయం అని నిపుణులు అంటున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగాయి. ఎల్పీజీ సిలిండర్ పై  రూ.50 పెరిగింది. 

Read More:

ఏపీ రొయ్యలపై 26% దిగుమతి సుంకం... దారుణంగా పడిపోయిన ధరలు

చేపల ఛాలెంజ్ 2.0… ₹1 కోటి ప్రైజ్ మనీ

 

Share your comments

Subscribe Magazine

More on News

More