News

నేటినుండే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లక్కీ డ్రా.. అదృష్టవంతులు ఎవరో తెలుసుకోండి?

Gokavarapu siva
Gokavarapu siva

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేసిన విషయం మనకి తెలిసిందే. మంత్రి స్పష్టమైన సూచనలకు అనుగుణంగా, పూర్తి చేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి జిహెచ్‌ఎంసి ఆరు విభిన్న దశలతో కూడిన సమగ్ర ప్రణాళికను రూపొందించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అర్హులైన వారి వివారాలు గురువారం విడుదల అవ్వనున్నాయి. మహా నగరం పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60వేల మందితో జాబితా సిద్ధంచేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ గురువారం వెల్లడించనున్నారు.

మూడేళ్ల కిందటే, హైదరాబాద్ నగరంలో నిరుపేదలు ప్రభుత్వం అందిస్తున్న, ఉచిత రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 5 వేల నుంచి 10 వేల వరకు దరఖాస్తులు గణనీయంగా వచ్చాయి. అర్హతను నిర్ణయించడానికి, GHMC మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయి మూల్యాంకనాలను నిర్వహించారు.

ఇది కూడా చదవండి..

1 తేదీన మారనున్న గ్యాస్ ధరలు .. ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో యాభైశాతం దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. సెప్టెంబరు మొదటి వారంనుంచి దశలవారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉండటంతో మిగిలిన దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయనున్నారు.

సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభమైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అక్టోబర్‌ మూడో వారం వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆరు దశల్లో 65 వేలకుపైగా ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. అంతేకాదు ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లు కూడా పూర్తి కావడంతో ఈ పంపిణీ కార్యక్రమంలో చేర్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

1 తేదీన మారనున్న గ్యాస్ ధరలు .. ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి

Related Topics

double bed room CM KCR

Share your comments

Subscribe Magazine

More on News

More