News

అన్నిరకాల పంటలు, నేలలకు ఉపయోగపడే రోటావేటర్ టెక్నాలజీతో భారత్‌లో పంటలకు నేలలను సిద్ధం చేయడంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని నిర్దేశించుకున్న మహీంద్రా

KJ Staff
KJ Staff
Mahindra Supervator
Mahindra Supervator

. అన్ని రకాల సాగు పరిస్థితుల కోసం డిజైన్ మరియు అభివృద్ధి చేయబడిన, హెవీ నుంచి లైట్ డ్యూటీ వరకు ఉండే మన్నికైన, విశ్వసనీయమైన రోటావేటర్ల శ్రేణితో భారత్‌లో పంటల కోసం నేలలను సిద్ధం చేసే పనుల్లో సమూలంగా మార్పులు తేవాలని మహీంద్రా నిర్దేశించుకుంది

. మేడిన్ ఇండియా మహీంద్రా రోటావేటర్లు మహీంద్రా యొక్క విస్తృత నెట్‌వర్క్‌లో సులభతరమైన ఫైనాన్సింగ్, వారంటీ, సర్వీస్, స్పేర్స్‌తో లభిస్తాయి

. పురోగామి రైతుల కోసం డిజైన్, అభివృద్ధి చేయబడిన ఇంటెలిజెంట్ రోటావేటర్

చండీగఢ్: ప్రపంచంలోనే పరిమాణంపరంగా అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్, భారత్‌లోని అన్ని రకాల నేలలకు, పంటలకు అనువుగా రూపొందించిన రోటావేటర్ల సమగ్ర శ్రేణితో, భారత్‌లోని రైతుల కోసం నేలలను సిద్ధం చేసే పనుల్లో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశంలోనే అతి పెద్ద రోటావేటర్ తయారీ సంస్థల్లో మహీంద్రా కూడా ఒకటి. తన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం డిజైన్ చేసిన, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పరీక్షించిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రకాల సాగు పరిస్థితులకు అనుగుణంగా ఉండే పనితీరును, విశ్వసనీయతను అందించే విధంగా రైతులతో కలిసి పని చేస్తోంది.  మేడిన్ ఇండియా మహీంద్రా రోటావేటర్లు పంజాబ్‌లోని నభాలో ఉన్న ప్రత్యేక తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడుతున్నాయి.

నేలను సిద్ధం చేసే పనులకు పట్టే సమయాన్ని, శ్రామిక శక్తిని తగ్గించుకునేందుకు మహీంద్రా రోటావేటర్లు తోడ్పడగలవు. ఇవి సీడ్‌బెడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. కలుపు నియంత్రణలోను, అవశేషాల నిర్వహణలోనూ తోడ్పడతాయి. అదే సమయంలో నేల యొక్క భౌతిక పరిస్థితులను మెరుగుపరుస్తాయి. మహీంద్రా రోటావేటర్లు 15 నుంచి 70 హెచ్‌పీ వరకు ఉండే ట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటాయి. వివిధ రకాల నేలలపై పని చేసేందుకు అనువైనవిగా ఉంటాయి. దుక్కి దున్నే క్రమంలో ఇంధన వినియోగం తక్కువగా ఉండేలా, మరియు అత్యంత మన్నికగా ఉండేలా ఈ రోటావేటర్లు డిజైన్ చేయబడ్డాయి. అత్యంత కఠినతరమైన నేలల్లోనూ దీర్ఘకాలం మన్నేలా మహీంద్రా రోటావేటర్ల బ్లేడ్లు ‘బోరోబ్లేడ్స్’ అనే ప్రత్యేక బ్రాండెడ్ ఉక్కు లోహంతో తయారు చేయబడ్డాయి.

Mahindra Rotavator
Mahindra Rotavator

పురోగామి రైతుల అవసరాలను తీర్చేందుకు, రోటావేటర్‌లోని పొందుపర్చిన బ్లూటూత్ టెక్నాలజీతో యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసే ‘ఇంటెలిజెంట్ రోటావేటర్’ను కూడా మహీంద్రా అందిస్తోంది.

నేలలను సిద్ధం చేసే ప్రక్రియను యాంత్రీకరణ చేయడంపై మహీంద్రాకు గల ఆకాంక్షలపై మాట్లాడుతూ, ఆధునిక సాగు యంత్రపరికరాలు అభివృద్ధి చెందే కొద్దీ రోటావేటర్లనేవి సాగు ఉత్పాదకతను, సమర్ధతను గణనీయంగా పెంచడంలో తోడ్పడగలవని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. సాగులో పరివర్తన తేవడం, జీవితాలను సుసంపన్నం చేయడం అనే మా లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌లో రోటావేటర్ టెక్నాలజీ విషయంలో మహీంద్రా గణనీయంగా పురోగతి సాధించింది అని మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ ప్రెసిడెంట్ శ్రీ హేమంత్ సిక్కా తెలిపారు. 

భారతదేశంలో నేలలను సిద్ధం చేసేందుకు పట్టే సమయం మరియు శ్రామిక శక్తిని గణనీయంగా తగ్గించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. రైతులతో దశాబ్దాల పాటు కలిసి పని చేసిన మీదట సమగ్ర రోటావేటర్ల శ్రేణిని తయారు చేసింది. మేడిన్ ఇండియా మహీంద్రా రోటావేటర్లు పంజాబ్‌లోని నభాలో ఉన్న ప్రపంచ స్థాయి ప్లాంటులో తయారు చేయబడుతున్నాయి. మా విస్తృత సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్‌వర్క్‌తో పాటు మొత్తం ఉత్పత్తుల శ్రేణిపై అసమానమైన 2 ఏళ్ల సమగ్ర వారంటీ అనేది మా ఉత్పత్తుల వినియోగంలో రైతులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు తోడ్పడగలదు అని మహీంద్రా & మహీంద్రా ఫార్మ్ మెషినరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్రీ కైరాస్ వఖారియా (Kairas Vakharia) తెలిపారు.

రైతులకు మహీంద్రా ఫైనాన్స్ అందించే సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన రుణాలతో, మహీంద్రా రోటావేటర్లు దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా యొక్క ట్రాక్టర్ డీలర్ నెట్‌వర్క్ మరియు ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయించబడుతున్నాయి.

రైతులకు నిశ్చింత కలిగించేలా, మహీంద్రా రోటావేటర్లు పరిశ్రమలోనే అత్యుత్తమమైన విధంగా 2 ఏళ్ల వారంటీతో అందించబడుతున్నాయి. ఇతర తయారీ సంస్థలు 6 నుంచి 12 నెలల వారంటీ మాత్రమే అందిస్తున్నాయి.

సాగు యాంత్రీకరణలో అగ్రగామి

50 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా, భారతదేశంలోని సాగుభూములను యాంత్రీకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ మరియు ప్రపంచవ్యాప్తంగా రైతులకు అధునాతన సాంకేతికతలను అందించడం ద్వారా వారి అభ్యున్నతికి తోడ్పడాలని, వారంతా ఎదగడంలో తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో సంస్థ పని చేస్తోంది.

పరిమాణంపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ “సాగులో పరివర్తన, జీవితాలను సుసంపన్నం చేయడం” అనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ క్రమంలో మారుతున్న వ్యవసాయ రంగం అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల నుంచి తెలుసుకున్న విషయాల ద్వారా సాగు పరికరాల ఉత్పత్తులు, సొల్యూషన్స్‌ యొక్క విస్తృత శ్రేణిని (ట్రాక్టర్లు మాత్రమే కాకుండా) రూపొందించి, అందిస్తోంది. ఇందుకోసం గత దశాబ్దకాలంగా కొనుగోళ్ల ద్వారా గ్లోబల్ టెక్నాలజీ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగించే టెక్నాలజీల నుంచి భారత మార్కెట్‌కు అనువైన సాంకేతికతలను మహీంద్రా వినియోగంలోకి తెచ్చేందుకు, అలాగే భారత్ మరియు ప్రపంచవ్యాప్తంగా చిన్న కమతాలున్న రైతులకు వాటిని చౌకగా, అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కేంద్రాలు తోడ్పడుతున్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More