హైదరాబాద్ లో గత సంవత్సరం న ఉంచి వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి , గత నెలలోనే నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్లో భారీ ఎత్తున్న మంటలు ఎగసిపడగా ఇప్పుడు అలాంటి ఘటననేనే చిక్కడపల్లి లో జరిగింది .
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంట్లు, ఇతర వస్తువులను భద్రపరిచిన గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.చిక్కడపల్లిలోని ఈవెంట్ డెకరేషన్ మెటీరియల్ గోడౌన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది .
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంట్లు, ఇతర వస్తువులను భద్రపరిచిన గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.
మంటల తీవ్రతను గమనించిన అధికారులు మరిన్ని అగ్నిమాపక యంత్రాలతో రంగంలోకి దిగారు. వివిధ అగ్నిమాపక కేంద్రాలకు చెందిన 13 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి.
పక్కనే ఉన్న కంపెనీకి కూడా మంటలు వ్యాపించాయి.అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకుని అదుపులోకి తెచ్చారు.మంత్రి శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అగ్నిమాపక చర్యలను సమీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని వాణిజ్య సంస్థల యజమానులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Share your comments