దేశంలో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా రసాయన ఎరువులకంటే ప్రభావవంత మైన జీవ ఎరువులను రైతులు వినియోగించే విధంగ ప్రోత్సహించేందుకు గాను మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది , త్వరలో రైతులకు తక్కువ ధరకు అధిక ప్రభావవంతమైన మరియు సారవంతమైన ఎరువులను తీసుకురానుంది ఈపాటికే ఈమేరకు చర్యలను ప్రారంభయించింది మార్కెఫెడ్ , జీవ ఎరువులలో కొత్త రకం ఎరువును తీసుకు రానున్నది .
వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఉద్యాన పంటలకు వినియోగించే విధంగా రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారం పెంచే జీవ ఎరువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. 'మార్క్‌ఫెడ్ గోల్డ్’ పేరుతో వచ్చే నెలలో ఈ బయో ఫర్టిలైజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 40 కిలోల బ్యాగ్ ధరను రూ. 700గా నిర్ణయించింది.
ఇప్పటికె అధిక రసాయన ఎరువులను వినియోగించడం ద్వారా భూ సారం తగ్గిపోయిన విషయం తెలిసిందే , ఎప్పటికైనా జీవ ఎరువులను వినియోగించి భూ సారం పెంచుకోవచ్చని మార్క్‌ఫెడ్ అధికారులు ఆశిస్తున్నారు 'మార్క్‌ఫెడ్ గోల్డ్’ పేరుతో వచ్చే నెలలో ఈ బయో ఫర్టిలైజర్‌ను నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో ప్లాంట్‌ను నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి .
తెలంగాణాలో భానుడి భగభగలు.. వాతవరణ శాఖ హెచ్చరిక !
భూమిలో సేంద్రీయ కర్భనాన్ని పెంచి నేలను సారవంతం చేయడం కోసం అవసరమైన సూక్ష్మజీవులు నెలలో పెరిగే విధంగా దీనిలో ప్రత్యేక మిశ్రమాని వినియోగించనున్నారు . ఈ బయో ఫర్టిలైజర్‌ను వినియోగించడం వల్ల పంటలకు క్రిమికీటకాలు కూడా సోకవని, తద్వారా క్రిమి సంహారక మందులు పిచికారి చేయ్యాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గి రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు త్వరలోనే ఈ ఎరువును తీసుకురానున్నట్లు వెల్లడించారు కంపెనీ అధికారులు .
Share your comments