ఈ మార్చ్ నెలలో, మొత్తం భారత దేశంలోని 13 రాష్ట్రాల్లో, కృషి జాగరణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన, MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్, ను నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమంలో రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలు, ఫార్మింగ్ వర్కుషాపులు, ఇంకా మరెన్నో విజ్ఞానాత్మకమైన, కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అంతే కాకుండా ఈ కార్యక్రమం రైతులను, అగ్రిటెక్ కంపెనీలను, మరియు శాస్త్రజ్ఞులను ఒక్క చోట చేర్చే మంచి వేదిక.
ఆహార రక్షణ కోసం రైతులు చేస్తున్న, త్యాగాలకు, కృషికి, తగ్గ బహుమానాన్ని, మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI)అవార్డుల రూపంలో , కృషి జాగరణ్ అందిస్తుంది. ఇప్పటికే భారత దేశమలోని పలు రాష్ట్రాల రైతులను ఈ అవార్డులతో సత్కరించిన కృషి జాగరణ్, ఈ మార్చ్ నెలల్లో ఏయే చోట్లల్లో సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహించి, రైతులను MFOI అవార్డులతో సత్కరిస్తుందో చూద్దాం.
- ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్ ) - మార్చ్ 5
- సోలాపూర్(మహారాష్ట్ర)- మార్చ్ 7
- సతారా(మహారాష్ట్ర )-మార్చ్ 12
- హాపూర్ (ఉత్తర్ ప్రదేశ్ )- మార్చ్ 12
- మీరట్(ఉత్తర్ ప్రదేశ్ )- మార్చ్ 13
- కొల్హాపూర్(మహారాష్ట్ర )- మార్చ్ 15
- భరూచ్ (గుజరాత్ )- మార్చ్ 18
- గోరఖ్పూర్(ఉత్తర్ ప్రదేశ్ )- మార్చ్ 19
- షామ్లి(ఉత్తర్ ప్రదేశ్ )- మార్చ్ 19
- వారణాసి (ఉత్తర్ ప్రదేశ్ ) - మార్చ్ 21
- సహరాన్పూర్ (ఉత్తర్ ప్రదేశ్ ) - మార్చ్ 27
- బిజ్నోర్ (ఉత్తర్ ప్రదేశ్ )- మార్చ్ 29
ఈ కార్యక్రమాలు అన్ని రైతులకు మంచి అనుభవాన్ని ఇస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం లో పాలుపంచుకుందాం అనుకునే కంపెనీలు, ముందుగా స్టాల్ల్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఉత్పాదనలు అన్ని రైతుల ముందు ప్రదర్శించేందుకు మరియు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. రిజిస్టర్ చేసుకునే కంపనీలు ఈ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. https://millionairefarmer.in/en/nominate-for-mfoi/
"మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా" సమర్పిస్తున్న వారు మహీంద్రా ట్రాక్టర్స్:
మహీంద్రా ట్రాక్టర్స్ సాహసమర్పిస్తున్న ఈ MFOI అవార్డలు భారతీయ రైతుల, గౌరవానికి ఒక చిహ్నంగా నిలుస్తాయి. ఎవరైతే రైతులు అవిశ్రాంత్రంగా ప్రయత్నిస్తూ, వినూత్న వ్యవసాయ పద్ధతులు వాడి తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారో వారిని కృషి జాగరణ్ MFOI అవార్డులతో సన్మానిస్తుంది. ఇటువంటి ఆలోచనాత్మకమైన రైతులు, మిగిలిన రైతులు అందరికి ప్రేరణదాయకంగా నిలుస్తారు
Share your comments