MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: రైతులను సన్మానించడానికి నిర్వహించే ఎంఎఫ్ఓఐ కిసాన్ సంరిద్ ఉత్సవ్, ఇప్పుడు సోలాపూర్ కృషి విజ్ఞాన కేంద్ర లో ప్రారంభమైంది. వ్యవసాయానికి సంభందం ఉన్న అనేక కంపెనీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, మరియు ఎంతో మంది రైతులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
వ్యవసాయ మీడియాలో తమకంటూ ఒక ప్రత్యేక స్థాన్నాన్ని సంపాదించుకున్న కృషి జాగరణ్, గత 27 సంవత్సరాలుగా, భారతీయ వ్యవసాయ వికాసం కోసం, మరియు రైతుల్లో చైతన్యం కోసం ఎంతో కృషి చేస్తుంది. రైతులకు కొత్త పరిజ్ఞానం పై ఆశక్తిని, మరియు పరిజ్ఞాన్నాన్ని పెంపొందించ్చడానికి అనేక, కార్యక్రమాలు, మేళాలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో, రూపుదిద్దుకున్నవే ఈ MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ లు . అయితే ఈ ఉత్సవాలను మండల లేదా రాష్ట్ర స్థాయిలో కాకుండా ఏకంగా, జాతియ స్థాయిలో నిర్వహించడం గమనార్హం. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయంలో అత్యుత్తమ విజయాలు సాధించిన లక్షాధికారి రైతులను, మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులతో సత్కరిస్తారు. అంతేకాకుండా ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తల నుండి రైతులు వ్యవసాయంలో అవసరమయ్యే కీలక మెళుకువలను, తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు MFOI అవార్డులు అంటే ఏమిటి? వాటిని పొందడానికి కావాల్సిన అర్హతలు ఏమిటో రైతులకు తెలియచేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని, మహారాష్ట్ర, సోలాపూర్, కృషి విజ్ఞాన్ కేంద్రం లో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి, MFOI స్పాన్సర్, మహీంద్రా ట్రాక్టర్స్ తో పాటు, భారత దేశములోని ప్రముఖమైన, ధనుకా అగ్రిటెక్ట్ మరియు ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రదర్శించి వాటి పనితీరును గురించి రైతులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది రైతులు విచ్చేసారు. వారి సమస్యల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి వాళ్ళ సందేహాలు అన్ని నివృత్తి చేసుకున్నారు.
మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా:
అసలు ఈ మిల్లియనీర్ ఫార్మర్ అవార్డ్స్ అంటే ఏమిటి? మిల్లియనీర్ ఫార్మర్స్ అని ఎవరిని అంటారు? అనే సందేహాం మీకు వచ్చే ఉంటుంది. వ్యసాయంలో విశిష్టమైన కృషి ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతున్న రైతులనే, మిల్లియనీర్ ఫార్మర్స్ అంటారు. అర్దమయ్యేలా చెప్పాలంటే వ్యవసాయం ద్వారా అధికంగా డబ్బు సంపాదిస్తున్న రైతులు. వీరిని గుర్తించి వాళ్ళ దగ్గరకే ఈ బహుమానాలును చేర్చడం జరుగుతుంది. ఈ అవార్డులు వాళ్ళ శ్రమకు ఎంతమాత్రం పరిమాణం కాకపోయినా, వాళ్ళ కష్టానికి తగ్గ చిహ్నంగా నిలుస్తుంది. పైగా వీరి స్ఫూర్తి దాయకమైన జీవితం ఇతరులకు కూడా ప్రేరణను, వ్యవసాయం పట్ల ఆశక్తిని పెంచుతుంది ఈ MFOI అవార్డులకు, వ్యవసాయంతో అనుబంధసంస్థల రైతులు అందరూ నమోదు చేసుకోవచ్చు. MFOI అవార్డ్స్ కోసం రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను అందించండి.
Share your comments