News

మరో ఆరు రోజుల్లో మీ ముందుకు...... MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్;

KJ Staff
KJ Staff

డేట్ గుర్తుపెట్టుకోండి.. మార్చ్ 7, 2024, ఉదయం 11:00 గంటలకు, సోలాపూర్ మహారాష్ట్ర, కృషి విజ్ఞాన్ కేంద్రం వేదికగా, కృషి జాగరణ్, వ్యవసాయంలో అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న, రైతులను "మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా" అవార్డులతో సత్కరించబోతుంది.

కృషి జాగరణ్, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే "MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్" కు మీరు అందరూ ఆహ్వానితులే. ఈ ఉత్సవంలో, లక్షాధికారి రైతులకు దక్కే గౌరవాన్ని మీ కళ్ళారా చూసి, వారి అనుభవాలను, ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ కష్టాలను వారి నుండే స్వయంగా తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. అంతే కాకుండా వయ్వసాయం లో వస్తున్న మార్పుల గురించి కొత్త సాంకేతికతల గురించి నిపుణుల ద్వారా తెలుసుకోండి. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని, మీ వ్యవసాయంలో చేర్చి అధిక దిగుబడులను, ఎక్కువ లాభాలను పొందండి.

ఇటీవల, లాఖిమ్పుర్, ఉత్తర్ ప్రదేశ్ లో మేము నిర్వహించిన, "MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్" ఘన విజయాన్ని అందుకుంది. 500 కంటే ఎక్కువ మంది రైతులు హాజరు అయినా ఈ ఉత్సవం, వరి పైరులోని సమగ్ర నిర్వహణ చర్యల గురించి, వరిని ఆశించే చెడపీడల నుండి కాపాడుకోవడానికి పాటించవలసిన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకునేందుకు ఒక మంచి వేదికగా ఏర్పడింది. వీటితో పాటుగా చిరుధాన్యాల పంటా సాగు పద్దతులను, ఆధునిక హంగులతో, మార్కెట్లో ఉన్న ట్రాక్టర్ వివరాలను ఈ ఉత్సవ్ ద్వారా రైతులకు తెలియపరచడం జరిగింది.

ఇప్పుడు మీ వంతు, సరికొత్త ఉత్సాహంతో, మరిన్ని ఆశక్తికరమైన వర్కు షాపులులతో, ఈ నెల 7 వ తారీఖున, సోలఫూర్, మహారాష్ట్రలో మీ ముందుకు రాబోతున్నాం. ఆ ప్రాంతాల రైతులు అందరూ విచ్చేసి, మాఇ MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ ను విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాము

ఈ ఉత్సవ్ వ్యవసాయదారులతో పాటు, వ్యవసాయ రంగంలో అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆగిరికల్టురల్ కంపనీలకు కూడా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి వేదిక. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీ స్టాల్ ఏర్పాటుకు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కండి. త్వరపడండి.....  Register

Share your comments

Subscribe Magazine

More on News

More