News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: బోర్గాన్, సతారా, మహారాష్ట్ర.

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో విశేష కృషి చేసి, అత్యుత్తమ విజయాలు సాధించిన ధనవంతులైన రైతులను సత్కరించాడనికి మొదలు పెట్టిన మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. ఈ మార్చ్ నెలలో అనేక ప్రదేశాల్లో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 12 మార్చ్, 2024 న, అంటే ఈ రోజు, మహారాష్ట్ర లోని బోర్గాన్ గ్రామంలో, MFOI సంరిద్ కిసాన్ ఉత్సవాని నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో ఎటువంటి విశేషాలు ఉండబోతున్నాయి తెలుసుకోండి.

మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా:

వ్యవసాయం ఒక విధంగా జూదం అని చెప్పుకోవచ్చు. జూదంలో ఎలా ఐతే పెట్టిన డబ్బు వెన్నక్కి వస్తుంది అని నమ్మకం లేదో అలాగే వ్యవసాయంలో కూడా రైతులకు లాభం వస్తుంది అని నమ్మకం లేదు. కానీ జూదం ఆడచ్చా లేదా అనేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు మాత్రం ఆ అవకాశం ఉండదు. వ్యవసాయంలో కష్టం, నష్టం ఎంత ఉన్న రైతు మాత్రం వ్యవసాయాన్ని వీడదు. వ్యవసాయంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని నిలబడి, వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతులను సన్మానించడం, అత్యంత అవసరం. దీనికోసం రూపొందించినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు ఒక ఊరికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, భారత దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇప్పుడు మహారాష్ట్ర సతారాలోని, బోర్గాన్ ప్రాంతంలో నిర్వహించడుతుంది. చెరుకును ప్రధాన పంటగా సేద్యం చేసే ఈ ప్రాంతంలో, చెరుకు సాగుకు అవసరమైన యాజమాన్య పద్దతులను, పంటకు పట్టే చీడ పీడలను నుండి సమగ్ర రక్షణ చర్యలను తెలపడినికి డా. సూరజ్ నాలోడే గారు విచ్చేయనున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి ఆదర్శవంతమైన రైతుగా పేరొందిన రిషికేష్ ధానే తన విజయ గాధను, వివరించనున్నారు. అంతేకాకుండా ఎందరో రైతు సోదరులు, వ్యవసాయ విజ్ఞ్యానులు, ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

మహీంద్రా ట్రాక్టర్స్:

ఈ కార్యక్రమానికి భాగస్వాములైన, మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ తరఫునుండి అక్కడి డీలర్ హర్షల్ సభలే, ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేయనున్నారు. మహీంద్రా టాక్టర్స ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ లో వారి కంపెనీ ట్రక్టర్లను ప్రదర్శనలో ఉంచనున్నారు. మీ వ్యవసాయ వినియోగాలకు ఒక కొత్త ట్రాక్టర్ తీసుకుందాం అన్న ఆలోచన ఉన్న రైతులకు ఇది ఒక మంచి అవకాశం. వ్యవసాయ ఉపయోగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్టర్లను మరియు వాటి ప్రత్యేకతలు ఈ కార్యక్రమం ద్వారా మీరు తెలుస్కోవచ్చు.

MFOI అవార్డ్స్ ప్రధానోత్సవం:

ఈ కార్యకరమైని అతి ముఖ్యమైన ఘట్టం, MFOI అవార్డులను అందచేయడం. సతారా ప్రాంతంలో ఎంపిక చెయ్యబడిన రైతులను మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా గా గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే, ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ వారు అవార్డు గర్హితులకు, బహుమతులను అందచేయనున్నారు. మీరు కూడా MFOI అవార్డుల కోసం ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి.

Share your comments

Subscribe Magazine

More on News

More