News

west Bengal: వ్యవసాయ ఉత్పాదకతను పెంచే దిశగా MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహణ.....

KJ Staff
KJ Staff

భారతీయ వ్యవసాయ రూపురేఖలు మార్చే విధంగా, వ్యవసాయానికి ఊతమిచ్చి, రైతుల ఆదాయం పెంచే దిశలో ఈ ఎంఎఫ్ఓఐ కిసాన్ సంరిద్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు, ఒక ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, భారతదేశం మొత్తంలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

జులై 9. 2024 న, కృషి జాగరణ్, వెస్ట్ బెంగాల్లోని హుగ్లీ కృషి విజ్ఞాన్ కేంద్రంలో ఈ సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వామయం వహించి, 'సుసంపన్నమైన దేశం కోసం రైతుల ఆద్యం పెంచాలి' అన్న అంశం మీద ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసారు. భారత దేశంలో ప్రముఖ మసాలా బ్రాండ్ ఎవరెస్ట్ ఈ కార్యక్రమ నిర్వహణలో సహాయసహకారాలు అందించడం జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఈ కార్యక్రమాలకు నౌలెడ్జి పార్టనర్ గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశాన్ని రైతులకు చేర్చడంలో సహాయం చేస్తున్నారు. 200 మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైన సమాచారం గురించి, నూతన సాగు పద్దతులు మరియు అధునాత వ్యవసాయ యంత్రాల గురించి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి పేర్లు నమోదుతో ప్రారంభమైంది, తరువాత దీపం వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. హుగ్లీ జిల్లా ఉద్యానవన అధికారి డాక్టర్ సుభోదీప్ నాథ్ తన ప్రసంగంలో ఉద్యానవన శాఖ రైతుల సంక్షేమ పథకాల గురించి సభకు తెలియజేశారు. ఇది కాకుండా, డాక్టర్ అమితవ బెనర్జీ, Asst. డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, BCKV, దేబేష్ చంద్ర దాస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (WBP) & PD, ATMA, హుగ్లీ, డాక్టర్ ప్రతాప్ ముఖోపాధ్యాయ, మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ICAR-CIFA, భువనేశ్వర్, మదన్ మోహన్ కోలే, కృషి కర్మధాక్ష్య, డాక్టర్, హూగ్లీ ఎడ్యుకేషన్-BCKV విస్తరణ డైరెక్టర్ కౌశిక్ బ్రహ్మచారి కూడా అనేక ముఖ్యమైన అంశాల గురించి సమావేశానికి అంతర్దృష్టిని అందించారు. డాక్టర్ బిస్వజిత్ సరాకర్ మరియు సాగర్ తమాంగ్, హుగ్లీ KVK 'వరిలో మిల్లెట్ కల్టివేషన్ మరియు డిసీజ్ పెస్ట్ మేనేజ్‌మెంట్‌పై ఇంటరాక్టివ్ డిస్కషన్' సందర్భంగా విలువైన సమాచారాన్ని రైతులతో పంచుకున్నారు.

అందరు ప్రసంగించిన తరువాత, అనేక మంది ప్రగతిశీల రైతులకు వారి విజయాలు మరియు సహకారాలను గుర్తిస్తూ ధృవపత్రాలు పంపిణీ చెయ్యడం జరిగింది. రైతు ఆర్ధిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి అంకితమై ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

'MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్' భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మరియు స్థిరమైన వ్యవసాయ పరిశ్రమ కోసం నిరంతరం శ్రమను సూచిస్తుంది. అంతేకాకుండా, 'MFOI, VVIF కిసాన్ భారత్ యాత్ర' వంటి మరిన్ని కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో , కృషి జాగరణ్ భారతీయ వ్యవసాయంలో గుర్తింపు పొందని కర్షకులను గుర్తించి, గౌరవించడం మరియు సాధికారత కల్పించడం, రాబోయే తరానికి మంచి భవిష్యత్తును అందించడం కోసం ఎల్లపుడు కట్టుబడి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More