News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: హాపూర్ ఉత్తర్ ప్రదేశ్ .

KJ Staff
KJ Staff

వ్యవసాయంలో విశేష కృషి చేసి, అత్యుత్తమ విజయాలు సాధించిన ధనవంతులైన రైతులను సత్కరించాడనికి మొదలు పెట్టిన మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. ఈ మార్చ్ నెలలో అనేక ప్రదేశాల్లో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 12 మార్చ్, 2024 న, అంటే ఈ రోజు, ఉత్తర్ ప్రదేశ్లోని హాపూర్ కృషి విజ్ఞాన కేంద్రంలో , MFOI సంరిద్ కిసాన్ ఉత్సవాని నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో యొక్క విశేషాలు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోండి.

వ్యవసాయం ఒక విధంగా జూదం అని చెప్పుకోవచ్చు. జూదంలో ఎలా ఐతే పెట్టిన డబ్బు వెన్నక్కి వస్తుంది అని నమ్మకం లేదో అలాగే వ్యవసాయంలో కూడా రైతులకు లాభం వస్తుంది అని నమ్మకం లేదు. కానీ జూదం ఆడచ్చా లేదా అనేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు మాత్రం ఆ అవకాశం ఉండదు. వ్యవసాయంలో కష్టం, నష్టం ఎంత ఉన్న రైతు మాత్రం వ్యవసాయాన్ని వీడదు. వ్యవసాయంలో వచ్చే ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని నిలబడి, వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న రైతులను సన్మానించడం, అత్యంత అవసరం. దీనికోసం రూపొందించినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు ఒక ఊరికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, భారత దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ అభ్యునతికి విశేష కృషి చేస్తున్న రైతులను సత్కరించే ఒక వినూత్న కార్యక్రమాన్ని కృషి జాగరణ్ ప్రారంభించింది. కృషి జాగారం గత 17 సంవత్సరాల నుండి రైతుల మేలు కోసం ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రూపొందించ్చిందే MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ కార్యక్రమాలు.

ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్, హాపూర్ కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడుతుంది. చెరుకును ప్రధాన పంటగా సేద్యం చేసే ఈ ప్రాంతంలో, చెరుకు సాగుకు అవసరమైన యాజమాన్య పద్దతులను, పంటకు పట్టే చీడ పీడలను నుండి సమగ్ర రక్షణ చర్యలను తెలపడినికి ఆ ప్రాంత కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ నిపుణులు డా. ఆశిష్ త్యాగి విచ్చేయనున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి ఆదర్శవంతమైన రైతుగా పేరొందిన రిషికేష్ ధానే తన విజయ గాధను, వివరించనున్నారు. దీనితో పాటుగా ఎందరో రైతు సోదరులు, వ్యవసాయ విజ్ఞ్యానులు, ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. చిరు ధాన్యాల పంట సాగు యోక్క ఉపయోగాల గురించి, మరియు మెరుగైన యాజమాన్య పద్దతుల గురించి, కృషి విజ్ఞాన కేంద్ర, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, డా. నీలం కుమారి తెలియచేయనున్నారు. మరియు కృషి విజ్ఞాన కేంద్ర యొక్క పనితీరు, మరియు రైతులకు కేవీకే లు అందించే సేవల గురించి డా. అశోక్ కుమార్ యాదవ్ తెలియచేస్తారు.

మహీంద్రా ట్రాక్టర్స్:

ఈ కార్యక్రమానికి భాగస్వాములైన, మహీంద్రా ట్రాక్టర్స్ కంపెనీ తరఫునుండి అక్కడి డీలర్, ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేయనున్నారు. మహీంద్రా టాక్టర్స ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ లో వారి కంపెనీ ట్రక్టర్లను ప్రదర్శనలో ఉంచనున్నారు. మీ వ్యవసాయ వినియోగాలకు ఒక కొత్త ట్రాక్టర్ తీసుకుందాం అన్న ఆలోచన ఉన్న రైతులకు ఇది ఒక మంచి అవకాశం. వ్యవసాయ ఉపయోగాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాక్టర్లను మరియు వాటి ప్రత్యేకతలు ఈ కార్యక్రమం ద్వారా మీరు తెలుస్కోవచ్చు. వ్యవసాయ వినియోగాలకు ట్రక్టర్ ఎంతో అవసరం. మట్టిని దున్నడానికి, మరియు అనేక ఇతర అవసరాలకి ట్రాక్టర్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. అన్ని వ్యవసాయ పనులకు అనువుగా మహీంద్రా ట్రాక్టరల్ను రూపొందించడం జరిగింది. మహీంద్రా ట్రాక్టర్లు వ్యవసాయ ఉత్పాదకత పెంచి మంచి లాభాలు తెచ్చిపెట్టేందుకు మీకు సహాయపడుతుంది.

MFOI అవార్డ్స్ ప్రధానోత్సవం:

ఈ కార్యకరమైని అతి ముఖ్యమైన ఘట్టం, MFOI అవార్డులను అందచేయడం. సతారా ప్రాంతంలో ఎంపిక చెయ్యబడిన రైతులను మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా గా గుర్తించి వారిని సత్కరించడం జరుగుతుంది. దీనితో పాటుగా సీంభౌలి షుగర్ మిల్, అసిస్టెంట్ జెనరల్ మేనేజర్, శ్రీ విశ్వరాజ్ సింగ్ ప్రత్యేక అతిధులుగా విచ్చేసి, చెరుకు రైతుల లాభాలను పెంచేందుకు తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియచేస్తారు. అవార్డుల ప్రధానోత్సవం అనంతరం విజేతలు మరియు అతిథులతో ఫోటో సెషన్తో ఈ కార్యకర్మం ముగుస్తుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More