News

MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్: ముషీరాబాద్, వెస్ట్ బెంగాల్

KJ Staff
KJ Staff

సుమారు 250 మంది రైతుల రాకతో, వెస్ట్ బెంగాల్ లోని ముషిరాబాద్ లో, కృషి జాగరణ్ 'ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవ్' నిర్వహించిది. భారతీయ లు రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది. రైతుల సుస్థిరాభివృధికి తోడ్పడే ఈ కార్యక్రమం గురించి మీ కోసం.

జూలై 16, 2024న, పశ్చిమ బెంగాల్‌లోని ముషిరాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్' ప్రాంతం అంతటా ఉన్న రైతులను స్వాగతించడంతో ఉత్సాహంతో, మరియు ఎంతో శోభాయాణంగా మారింది. కృషి జాగరణ్ నిర్వహించే ఈ కార్యక్రమానికి , మహీంద్రా ట్రాక్టర్స్ వారు స్పాన్సర్ చేసారు మహీంద్రా ట్రాక్టర్స్ ఈ కార్యక్రమం ద్వారా 'సంపన్న భారత్ కోసం రైతుల ఆదాయాన్ని పెంచడం'పై దృష్టి సారించింది. అలాగే సోమాని సీడ్స్ మరియు ఎవరెస్ట్ మద్దతుతో, మరియు ICAR నాలెడ్జ్ పార్టనర్‌తో, ఉత్సవ్ వ్యవసాయ సమాజానికి అతి ముఖ్యమైన వేదికగా పనిచేసింది. రైతులను తాజా వ్యవసాయ పద్ధతులు మరియు ఆవిష్కరణలతో అనుసంధానించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం. ఈ కార్యక్రమానికి మొత్తం 250 మంది రైతులు హాజరయ్యారు, వ్యవసాయంలో వస్తున్న కొత్త పద్ధతులు మరియు వ్యవసాయ సంబంధిత పరిజ్ఞానంపై నిపుణుల నుండి విలువైన సమాచారం పొందారు.

ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరైన వారి రిజిస్ట్రేష‌న్‌తో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం, ఆ త‌ర్వాత సంప్రదాయంగా దీపం వెలిగించ‌డం జ‌రిగింది. ఈ దీపన్నీ పలువురు వ్యవసాయ నిపుణులు, రైతులు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ఫిషరీస్ మంత్రి, బిప్లబ్ రాయ్ చౌదరి, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అభివృద్ధి మరియు చేపల పెంపకందారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చిస్తూ వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రసంగించారు. వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ యానిమల్ & ఫిషరీ సైన్సెస్ నుండి డాక్టర్ కేశబ్ ధార మరియు BCKV నుండి డాక్టర్ కౌశిక్ బ్రహ్మచారి కూడా తమ నైపుణ్యాన్ని ఆన్‌లైన్‌లో పంచుకున్నారు.

విశిష్ట అతిథులు, పంచాయితీ ప్రెసిడెంట్ రాకేయా బీబీ, బ్లాక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గోలాబ్ షేక్, బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ సాయిబుర్ రెహమాన్, మరియు ADA భగవంగోల మహిషన్ దాస్ వ్యవసాయంలో ముర్షిదాబాద్ యొక్క పురోగతిని మరియు మరింత పురోగతికి అవసరమైన చర్యలను నొక్కిచెప్పారు. ముర్షిదాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం నుండి వ్యవసాయ నిపుణులు, డాక్టర్ ఉత్తమ్ రాయ్, సోమ గిరి, అబూ తలేబ్ మరియు సమీరన్ పాత్ర వంటి వారు కూడా విలువైన సమాచారాన్ని అందించారు.

2023 లో ప్రారంభించిన ఈ MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్' విజయ పరంపర తర్వాత ఇప్పుడు 'మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ 2024' వైపు దృష్టి సారించి ఈ కార్యక్రమానికి కూడా భారీ విజయం చేకూర్చే దిశగా కృషి జాగరణ్ పనిచేస్తుంది. మహీంద్రా ట్రాక్టర్స్ స్పాన్సర్ చేసిన ఈ అవార్డులు వ్యవసాయంలో శ్రేష్ఠత మరియు ఆవిష్కరణలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More