ఇప్పటి వరకు భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో సంచరిస్తూ రైతులను సత్కరిస్తూ వచ్చిన MFOI కిసాన్ సంరిద్ ఉత్సవ్, ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్లోని పలు జిల్లాలోని రైతులకు పురస్కారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఐతే ఎక్కడెక్కడ ఈ మహోత్సవాలు జరగబోతున్నాయో పూర్తిగా చదివి తెలుసుకోండి.
ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్లోని, లఖిమ్పుర్ లో జరిగిన ఈ మహోత్సవం విశేషమైన ఆధరణ అందుకుంది. 500 మంది ఔత్సహికులైన రైతులు పాలుపంచుకున్న ఈ కార్యక్రమం వారికీ ఎన్నో కొత్త విషయాలు తెల్సుకునేందుకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చోటు చేసుకోబోతుంది. లాఖిమ్పుర్ లో జరిగిన ఈ కార్యకర్మం విజయవంతం కావడంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా విజయాన్ని అందుకుని రైతుల మన్ననలు పొందుతుంది అని ఆశిస్తున్నాము.
మార్చ్ నెల మొత్తం ఉత్తర్ ప్రదేశ్లో, ఈ ప్రాంతాల్లో MFOI కిసాన్ సంరిద్ ఉత్సవ్ చోటుచేసుకోనుంది.
- ఝాన్సీ - మార్చ్ 5
- హాపూర్ - మార్చ్ 12
- మీరట్ - మార్చ్ 13
- లక్నో - మార్చ్ 14
- గోరఖ్పూర్ - మార్చ్ 19
- షామిల్ - మార్చ్ 19
- వారణాసి - మార్చ్ 21
- సహరాన్పూర్ - మార్చ్ 27
- బిజ్నోర్ - మార్చ్ 29
పైన చెప్పిన కార్యక్రమాల్లో రైతులకు విజ్ఞానవంతమైన కార్యక్రమాలతో పాటు, వ్యవసాయంలో విశేష కృషి చేసి లక్షలు సంపాదిస్తున్న రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా (MFOI) అవార్డులతో సత్కరించనున్నారు. MFOI అవార్డులకు అర్హత పొందడానికి వ్యవసాయం లేదా వ్యవసాయ అనుబంధ రంగాల్లో విజయాలు సాధించిన రైతులు ఈ అవార్డులకు అర్హులు. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. Register
రైతులతో పాటు వ్యవసాయ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ ఉత్పత్తులను రైతులకు ప్రదర్శించండి. మీ స్టాల్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా నమోదుచేసుకోండి. Register
Share your comments