మధ్య ప్రదేశ రాష్ట్రంలోని సియోని కృషి విజ్ఞాన్ ప్రాంగణంలో, జూన్ 05, 2024న , మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా సంరిద్ కిసాన్ ఉత్సవ్ నిర్వహించడం జరిగింది. కృషి జాగరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఔత్సాహికులైన రైతులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు మరియు, వివిధ వ్యవసాయ టెక్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క విశేషాలు మీ కోసం.
భారతదేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యాలన్న ఉదేశ్యంతో కృషి జాగరణ్, ఈ ఎంఎఫ్ఓఐ సంరిద్ కిసాన్ ఉత్సవాలను నిర్వహిస్తుంది. మధ్య ప్రదేశ్, సియోని లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ అందిచగా, స్థిల్ మరియు సియోని వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన్ కేంద్రం వారు సహాయసహకారాలు అందించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసిఏఆర్) ఈ కార్యక్రమానికి నౌలెడ్జి పార్టనర్ గా వ్యవహరించడం గర్వకారణం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు నూతన సాగు విధివిధానాల మీద మరియు, నూతన సాంకేతికత మీద విశేషమైన జ్ఞానాన్ని సంపాదించారు.
మధ్య ప్రదేశ్, సియోని, కృషి విజ్ఞాన్ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ శేఖర్ సింగ్ బఘేల్ (సీనియర్ సైంటిస్ట్ & హెడ్ KVK, సియోని), ఆశా ఉపవంశీ, JK సింగ్ (DGM ధనుకా అగ్రిటెక్), ప్రద్యుమ్న త్రిపాఠి (రీజనల్ మేనేజర్, మహీంద్రా ట్రాక్టర్స్), డాక్టర్ నిఖిల్ కుమార్ సింగ్, డాక్టర్ KK దేశ్‌ముఖ్ (KVK, సియోని ), డాక్టర్ NK సింగ్ (KVK, సియోని), మోరిష్ నాథ్ (DDA, సియోని) మరియు ఇంజినీర్. ఈ కార్యక్రమానికి కుమార్ (సియోని) హాజరయ్యారు.వీరంతా వ్యవసాయంలో తమకున్న విశేష అనుభవంతో రైతులకు అవసరమైన సూచనలు ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేసారు.
సియోనిలోని కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ మరియు సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ సింగ్ బఘేల్ మాట్లాడుతూ , చాలా మంది రైతులు ఒకే రకమైన పంటలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇది వివిధ సమస్యలకు దారితీస్తుందని ప్రస్తావించారు. కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకోవడానికి సాయిల్ హెల్త్ కార్డును ఉపయోగిస్తుండగా, మిగిలిన రైతులు భూసార పరీక్షలు చెయ్యించడం లేదని దీని వలన ఎరువుల వినియోగం అధికమయ్యేందుకు అవకాశం ఉన్నట్లు అయన తెలిపారు. రైతులు మట్టి ఆరోగ్యంపై మరింత చురుగ్గా మరియు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని డాక్టర్ బఘేల్ నొక్కి ప్రస్తావించారు.
మిగిలిన శాస్త్రజ్ఞులు అందరు ప్రస్తావించిన తరువాత, అనేక మంది ప్రగతిశీల రైతులకు వారి విజయాలు మరియు సహకారాలను గుర్తిస్తూ ధృవపత్రాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమం కృతజ్ఞతతో ముగిసింది, రైతు సంఘాన్ని బలోపేతం చేయడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి అంకితమైన విజయవంతమైన రోజును సూచిస్తుంది.
Share your comments