వ్యవసాయంలో కోట్లు గణిస్తున్న రైతుల విజయాలను, వేడుకగా నిర్వహించే MFOI VVIF Kisan Bharath Yatra, మధ్య మరియు పశ్చిమ భారతదేశ రైతులను సత్కరించడానికి సంసిద్ధమయ్యింది. మధ్య మరియు పశ్చిమ ప్రాంతాల వైపుగా సాగే యాత్ర రేపు ఉత్తర్ ప్రదేశ్ ఝాన్షి నుండి ప్రారంభంకానుంది. మొత్తం 4,520 ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఒక లక్షకంటే ఎక్కువమంది రైతులను అనుసంధానం చేస్తూ సాగే ఈ యాత్ర మార్చ్ 5 అంటే రేపు, ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ లోని, రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ముందుకు సాగుతుంది.
జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, ద్వారా ఆధారితమైన ఈ MFOI VVIF Kisan Bharath Yatra ద్వారా భారత దేశం నలుముళ్ళల్లో పర్యటిస్తూ, ప్రతి ప్రాంతంలో, తమ కష్టం ద్వారా మరియు, ఆధునికతను అనుసరించడం ద్వారా వ్యవసాయంలో ఆదాయాన్ని పెంచుకుని కోటీశ్వరులు అయిన రైతులను గుర్తించి సత్కరిస్తాం. ఇప్పటికే ఈ యాత్ర ఉత్తర మరియు దక్షిణ భారత దేశంలో చాలాచోట్ల పర్యటించి, అక్కడి లక్షాధికారి రైతులను పురస్కరించి, రైతుల మన్ననలను, అభిమానాన్ని పొందింది. ఇప్పుడు ఈ యాత్ర దక్షిణ భారత దేశంవైపుగా, ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీ నుండి మొదలవుతుంది. రాణి లక్ష్మిభాయ్ సెంట్రల్ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, Dr. అశోక్ కుమార్ సింగ్, ఈ యాత్రను ప్రారంభిస్తారు. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు ఎం. సి. డొమినిక్, ఇంకా కృషి జాగరణ్ మేనేజింగ్ డైరెక్టర్ షైనీ డొమినిక్, ఈ వినూత్న కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ఈ యాత్ర ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమై మధ్య ప్రదేశ్, ఛాతిస్గఢ్ రాష్ట్రాలమీదుగా, మహారాష్ట్ర మరియు గుజరాత్ వరకు కొనసాగుతుంది.
రేపు ఝాన్సీలో జరగనున్న ఈ కార్యక్రమంలో జైన్ ఇరిగేషన్ లిమిటెడ్ వారు, వారి వ్యవసాయ ఉత్పత్తులను రైతులకోసం ప్రదర్శనలో ఉంచబోతున్నారు. రైతులు వాటి పనితీరు స్వయంగా చూసి తెసులుకుని, నచ్చితే అక్కడే కొనుగోలు చేయవచ్చు. సుమారు 500 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు అని అంచనా వేస్తున్నం.అంతేకాకుండా ఆ ప్రాంతంలో మేము గుర్తించిన లక్షాధికారి రైతులను కూడా మేము సన్మానించబోతున్నాము.
దేశం గుర్తించని వీరులకు, పురస్కారం:
వ్యవసాయాన్ని భారత దేశ వెన్నెముకగా పోలుస్తారు. దేశ ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయం ఎంతో కీలకం. కానీ సేద్యం చేసే రైతులకు వారికి అందవలసిన గుర్తింపు వారికీ దక్కడంలేదు. రైతు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహకాన్ని అందిస్తే వారు మరింత ముందుకు సాగడానికి వీలు ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని కృషి జాగరణ్ MFOI అవార్డులను ప్రవేశపెట్టింది. వ్యవసాయంలో విశేషమైన కృషి చేసిన రైతుల ఈ అవార్డుల కొరకు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలను నింపండి మేము మిమ్మల్ని సంప్రదిస్తాం. For Registration
Share your comments