కృషి జాగరణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన VVIF కిసాన్ భారత్ యాత్ర చక్రాలు ఇప్పుడు మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాల వైపుగా సాగుతున్నాయి. ఈ ప్రయాణం ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ, నుండి నిన్న ప్రారంభమై అదే దిశగా ఉత్తర్ ప్రదేశ్లోని మరి కొన్ని చోట్లతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ వరకు చేరుకోనుంది. మరొక్క విశేషం ఏమిటంటే, వ్యవసాయంలో అత్యుత్తమ కృషి చేస్తున్న, రైతులను MFOI అవార్డులతో సత్కరించడం .
భారత దేశంలోని రైతుల విజయ గాధలను, ప్రపంచానికి తెలియచేసే, బాధ్యత కృషి జాగరణ్ తీసుకుంది. భారతియా రైతులు ఆర్ధికంగా వెనకబడి, అప్పులతో మాత్రమే నిండి ఉంటారు అనే ఆలోచనను, తొలగించడానికి ఉన్న మార్గాల్లో ఒకటే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా బహుమతులు. ఎవరైతే రైతులు వ్యవసాయంలో వచ్చే నష్టాలను అధిగమించి, తమ స్వేదాన్ని సేద్యం కోసం ధారపోసి వ్యవసాయం ద్వారా లక్షలు సంపాదిస్తున్న కర్షకులను, కృషి జాగరణ్ MFOI అవార్డ్స్ తో సత్కరిస్తుంది. వారి విజయాలను కొనియాడటం, MFOI అవార్డు గ్రహితులకు మాత్రమే కాకుండా, మిగిలిన రైతులకు కూడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. సాధించాలి అనే తపనను రేపుతోంది. MFOI అవార్డ్స్ ద్వారా దేశం గుర్తించని ఎందరో రైతు వీరులను గుర్తించి వారిని సన్మానించాము.
VVIF కిసాన్ భరత్ యాత్ర:
భారత దేశములోని ప్రతి రైతు దగ్గరికి చేరుకోవాలి అనే ఉదేశ్యంతో, 2023 డిసెంబర్, న్యూ ఢిల్లీ లో ప్రారంభం అయిన ఈ యాత్ర రధం ఇప్పటికి నిర్విరామంగా ప్రయాణిస్తూనే ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగుతునే ఉంటుంది. భారత దేశంలోని ప్రతి రాష్ట్రానికి, ఈ యాత్రా వాహనం చేరుకుంటుంది. అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులతో సంభాషిస్తూ, వారి వ్యవసాయ భాధలను తీర్చేందుకు సలహాలు సూచనలు అందచేయడం జరుగుతుంది. మార్గ మద్యంలో ధనికులైన రైతులను MFOI అవార్డులతో సత్కరించడం జరుగుతుంది.
మధ్య మరియు పశ్చిమ రాష్ట్రాల్లో...
మార్చ్ 5, 2024, ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీ నుండి MFOI కిసాన్ భరత్ యాత్ర, ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి మేము ఊహించని రీతిలో రైతులు హాజరై ఘన విజయాన్ని అందించారు. రైతులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేరిన స్టాల్ల్స్ జనంతో కిటకిటలాడాయి. ఈ స్టాల్ల్స్ ప్రముఖ అగ్రిటెక్ కంపెనీలు వారి ఉత్పత్తులను ప్రదర్శించ్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు భాగస్వామ్యం వహించిన STIHL కంపెనీ వారి వ్యవసాయ పనిముట్లను రైతుల ముందు ఉంచారు. STIHL కంపెనీ వ్యవసాయానికి, గార్డెనింగ్ కు అవసరమయ్యే అనేక పనిముట్లను విక్రయిస్తూ, మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించ్చుకుంది.
మా ఈ MFOI VVIF కృషి భరత్ యాత్రలో మీరు భాగస్వాములు అయ్యేందుకు లేదా మీ స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. లింక్ వివరాలు: Register
Share your comments