News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: గెల, బానస్కత, గుజరాత్

KJ Staff
KJ Staff

ఇప్పటివరకు సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు అవార్డులు ఇవ్వడం మన చూసాం. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దేశానికి అన్నం పెట్టె రైతులకు అవార్డులతో సత్కరించే మహత్తర కార్యక్రమాన్ని కృషి జాగరణ్ ప్రారంభించింది. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి.డొమినిక్ ప్రారంభించిన ఈ కార్యక్రమం అందరికి ఆదర్శవంతంగా నిలుస్తుంది.

రైతులకు గుర్తింపు కల్పించి వారిని గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే చొరవవ కృషి జాగరణ్ అందిపుచ్చుకుంది. ఈ అవార్డుల గురించి భారత దేశం నలుమూలలకు విస్తరించడానికి కృషి జాగరణ్ MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలుపెట్టింది. ఈ యాత్ర రథం భారత దేశంలోని అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి రైతు సోదరులను మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల గురించి జాగృతం చేస్తుంది.

గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు.

ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.

MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు గెల, బానస్కత, గుజరాత్ లోని రైతు సోదరులని పలకరించడం జరిగింది. గత కొంత కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న భరత్ యాత్రకు మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా మహీంద్రా కంపెనీ అనేక వ్యవసాయ అవసరాల కోసం రూపొందించిన మహీంద్రా యావో మరియు నోవో ట్రాక్టర్లను నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి ట్రాక్టర్ పనితీరుపై అవగాహనా కల్పిస్తారు. రైతులు ఈ ట్రాక్టర్ల పనితీరు స్వయంగా చూసి నచ్చితే కంపెనీ నుండి నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.

ఈ రోజు యాత్రలో గెల, బానస్కత, గుజరాత్ రైతులతో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమినికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు హాజరయ్యారు. విచ్చేసిన రైతులందరికీ కృషి జాగరణ్ ప్రారంభించిన MFOI అవార్డుల గురించి తెలియచెయ్యడం జరిగింది. కార్యక్రమం అనంతరం విచ్చేసిన రైతు సోదరులందరిని సన్మాన పాత్రలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడనికి ఆ ప్రాంతంలో ఎఫ్పిఓ నడిపిస్తున్న చౌదరి లక్ష్మణ్ భాయ్ సహాయ సహకారాలు అందించారు. విచ్చేసిన రైతులందరితో మాట్లాడి , వ్యవసాయంలో వారు ఎదురుకుంటున్న ఒడిదుడుకుల గురించి తెలుసుకోవడం జరిగింది. చివరిగా రైతులకు ధన్యవాదాలు తెలియచెయ్యడంతో ఈ కార్యాక్రమాన్ని విచ్చేసిన రైతులకు ధన్యవాదాలు తెలియచెయ్యడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

Share your comments

Subscribe Magazine

More on News

More