News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: కోయ దరియా, ఝాబుఆ, మధ్య ప్రదేశ్

KJ Staff
KJ Staff

ప్రపంచ పటంలో, భారత దేశాన్ని వ్యవసాయ దేశంగా పరిగణిస్తారు. దాదాపు అన్ని గ్రామాల్లో వ్యవసాయాన్ని జీవనోపాధిక, ప్రజలు కొనసాగిస్తూ వస్తున్నారు. చాల పట్టణాల్లో వ్యవసాయం పై మక్కువ ఉన్న ప్రజలు, వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయాన్ని ప్రకృతితో మమేకమయ్యేందుకు ఒక సాధనంగా వినియోగిస్తుంటారు కొందరు ప్రజలు.

రైతే దేశానికి వెన్నుముకగా పరిగణిస్తారు. కానీ సేద్యం ద్వారా కొన్ని కోట్ల మంది జనం కడుపు నింపే రైతుకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. వ్యవసాయాన్ని, రైతులను చిన్న చూపు చూసే ఈ రోజుల్లో కూడా, ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని వీడక సేద్యాన్ని నిలబెడుతున్నారు. అంతేకాకుండా చాల మంది రైతులు వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. అటువంటి రైతులు ఎంతోమందికి ఆదర్శం. వారి గురించి అందరికి తెలిసి, గుర్తింపు ఏర్పర్చడానికి మొదలు పెట్టినవే ఈ MFOI అవార్డులు.

భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం, 60% కంటే ఎక్కువ జనాభా తమ జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న వ్యవసాయానికి, అలాగే సేద్యం చేసే రైతులకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. రైతు పడుతున్న శ్రమను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జాగరణ్ ఒక నూతన ఆలచనతో ముందుకు వచ్చింది. దేశానికి రైతులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డులతో సత్కరిస్తుంది. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంచలకులైన ఎం.సి. డొమినిక్ గారికి వచ్చిన ఈ ఆలోచన ద్వారా ఇప్పటవరకు ఎంతో మంది రైతులు తమ కష్టానికి ప్రతిఫలంగా ఈ అవార్డులను పొందారు. ఈ అవార్డులను భారత దేశంలోని రైతులు అందరి దగ్గరకి చేర్చేందుకు కిసాన్ భరత్ యాత్ర ఉపయోగపడుతుంది.

భారత దేశంలోని రైతులందరిని ఒకే త్రాటిపైకి చేర్చి, వారి పడుతున్న కష్టాలను, మరియు నిరంతర కృషి ద్వారా సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియచేయడానికి మొదలు పెట్టినవే MFOI అవార్డులు. ఈ అవార్డులను కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు.

MFOI అవార్డుల దేశంలోని రైతులందరికీ తెలియపరచడానికి MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.

MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు కోయ దరియా, ఝాబుఆ, మధ్య ప్రదేశ్ రైతులను పలకరించడం జరిగింది. ఈ యాత్రా కార్యాక్రమానికి మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా మహీంద్రా కంపెనీ అనేక వ్యవసాయ అవసరాల కోసం రూపొందించిన ట్రాక్టర్లను నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి వాటి పనితీరుపై అవగాహనా కల్పిస్తారు. రైతులు ఈ ట్రాక్టర్ల పనితీరు స్వయంగా చూసి నచ్చితే కంపెనీ నుండి నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.

కోయ దరియా, ఝాబుఆ, మధ్య ప్రదేశ్ లోని ఈ యాత్ర విజయవంతం కావడానికి ఆదివాసీ కిసాన్ ప్రొడ్యూసర్ కంపెనీ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు కృషి జాగరణ్ ప్రారంభించిన MFOI అవార్డ్స్ ప్రత్యేకత గురించి కృషి జాగరణ్ సభ్యులు వివరించారు. ఈ అవార్డులను ఎటువంటి కేటగిరీలుగా విభజించారనేది నిశితంగా చర్చించారు. ఈ అవార్డు కార్యక్రమాలను ఎక్కడ నిర్వహించబడతాయి, వాటి విశేషాలు ఏమిటో రైతులకు తెలియపరిచారు.అలాగే ఈ అవార్డులు పొందడానికి అర్హత ఉన్న రైతులకు వీటికి ఎలా నమోదు చేసుకోవాలో మార్గదర్శకాన్ని అందించారు.

Share your comments

Subscribe Magazine

More on News

More