కృషి జాగరణ్ వినూత్న పద్దతిలో ప్రారంభించిన ఎంఎఫ్ఓఐ వీవీఐఎఫ్ కిసాన్ భారత యాత్ర రథం భారతదేశమంతటా తిరిగి రైతులు పలకరిస్తూ వస్తుంది. ఒకప్పుడు రైతులను రాజుగా కొలిచేవారు, కానీ కాలక్రమేణా రైతులకు రావాల్సిన గుర్తింపు కరువైంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు ఎం.సి. డొమినిక్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు, అదే ప్రస్తుతం రైతులకు అందిస్తున్న మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. ఈ అవార్డుల గురించి దేశం నలుమూలలకు వ్యాప్తి చెయ్యడానికి కిసాన్ భారత్ యాత్ర రథం ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్ర రథం హర్యానాలోని చక్రి దాద్రి ప్రదేశంలో సంచరిస్తుంది.
రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ నలుమూలలకు చేరేందుకు MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర ద్వారా, కృషి జాగరణ్ ప్రతినిధులు భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి రైతులకు ఈ మిలియనీర్ ఫార్మర్ ఆప్ ఇండియా విశిష్టతల గురించి చాటిచెబుతున్నారు.
గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.
ఈ యాత్ర కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం దక్షణాది రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యాన, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచరిస్తూ రైతులకు MFOI అవార్డుల ప్రత్యేకత గురించి చాటిచెబుతుంది. కృషి జాగరణ్ భారతీయ వ్యవసాయానికి చేస్తున్న కృషి మరియు సహాయం గురించి రైతులకు, కృషి జాగరణ్ సభ్యులు వివరిస్తున్నారు. ఈ రోజు మోహనా, గ్వాలియర్, మధ్య ప్రదేశ్ రైతులతో సమావేశం అవ్వడం జరిగింది. ఎంతోమంది ఔత్త్సహికులైన రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ కిసాన్ యాత్ర భారత దేశమంతటా దిగ్విజయంగా పయనించడానికి మహీంద్రా ట్రాక్టర్లు మరియు స్తిల్ కంపెనీ వారు ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఈ యాత్ర రథం వెళ్లే ప్రతీచోటకి మహీంద్రా ట్రాక్టర్లు మరియు స్తిల్ తమ ఉత్పత్తులను తీసుకువెళ్లి రైతులకు వాటి పనితీరు గురించి, వివరిస్తారు. రైతులు ఆ యంత్రాల పనితీరును చూసి, వాటిపట్ల వారికున్న సందేహాలను, నిపుణుల నుండి అడిగి తెలుసుకోవచ్చు, అంతేకాకుండా నచ్చితే అక్కడే యంత్రాలను కొనుగోలు కూడా చేసే గొప్ప సౌకార్యని ఈ రెండు కంపెనీలు కల్పిస్తున్నాయి.
నేడు మోహనా, గ్వాలియర్, మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ రోడ్ షోలో ఎంతో మంది ఔత్సహికులైన రైతులు పాల్గొన్నారు. మొదట ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ, మాఫోయ్ అవార్డుల గురించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, కృషి జాగరణ్ సభ్యులు వివరించారు. తర్వాత ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం వహిస్తున్న, స్థిల్ మరియు మహీంద్రా టాక్టర్స్, తమ ఉత్పత్తులను రైతుల ముందు ప్రదర్శించారు. రైతులు వాటిపనితీరు నేరుగా చూసి వాటిగురించి తెలుసుకున్నారు. కృషి జాగరణ్ ఈ కార్యక్రమాలను అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. ప్రతి కార్యక్రమానికి రైతులనుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ గ్రామానికి చెందిన మహీందర్ సింగ్ అనే రైతు సోదరుడు సహాయసహకారాలు అందించారు. రైతులంతా ఎంతో ఉత్సహకంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
Share your comments