భారతదేశంలోని వ్యవసాయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న రైతులను గుర్తించి వారిని పురస్కరించడానికి మొదలుపెట్టినవే ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. వ్యవసాయం ద్వారా పది లక్షలకంటే ఎక్కువ సంపాదించే రైతులను మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డులతో పురస్కరిస్తారు. ఇంతటి విశిష్టమైన అవార్డులను అర్హులైన రైతుల వద్దకు చేర్చడం, మా యొక్క ముఖ్యఉదేశ్యం. ఈ లక్ష్యాన్ని సుగమం చెయ్యడానికి మొదలుపెట్టినవే ఈ ఎంఎఫ్ఓఐ అవార్డులు.
ఎంఎఫ్ఓఐ వివిఐఎఫ్ కిసాన్ భారత యాత్రలో భాగంగా, కృషి జాగరణ్ భరత్ యాత్ర రధం భారత దేశమంతా సంచరిస్తూ, ఈ అవార్డుల యొక్క గొప్పతనాన్ని రైతులకు తెలియపరచడం జరుగుతుంది. ఒకప్పుడు రైతులను రాజుగా కొలిచేవారు, కానీ కాలక్రమేణా రైతులకు రావాల్సిన గుర్తింపు కరువైంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కృషి జాగరణ్ వ్యవస్థాపకులు మరియు ముఖ్య సంపాదకులు ఎం.సి. డొమినిక్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చారు, అదే ప్రస్తుతం రైతులకు అందిస్తున్న మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులు. ఈ అవార్డుల గురించి దేశం నలుమూలలకు వ్యాప్తి చెయ్యడానికి కిసాన్ భారత్ యాత్ర రథం ముందుకు సాగుతుంది.
గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.
ప్రస్తుతం ఈ యాత్ర రథం మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతంలో సంచరిస్తుంది. ఇక్కడి ప్రాంతంలోని రైతులతో మాట్లాడి వారికి ఎంఎఫ్ఓఈ అవార్డుల గురించి తెలియపరచడం జరిగింది. ఈ యాత్ర రథం భారతదేశమంతా దిగ్వియజంగా సంచరించడానికి మహీంద్రా ట్రాక్టర్స్ ముఖ్య కారణం. మహీంద్రా ట్రాక్టర్లు ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర రథం వెళ్లే ప్రతీచోటకి మహీంద్రా ట్రాక్టర్లు కూడా వెళ్లి, రైతుల యొక్క అన్ని వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ట్రాక్టర్ల గురించి రైతులకు వివరిస్తారు. ఈ రోజు మధ్య ప్రదేశ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది రైతులు పాలుపంచుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ ఎంఎఫ్ఓఐ అవార్డుల గురించి తెలియచెయ్యడంతోపాటు, కృషి జాగరణ్ ప్రచురించే నెలసరి మ్యాగజీన్లు కూడా అందించడం జరిగింది.
Share your comments