కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినప్పటికీ 2022-23సంవత్సరానికి వరిసాగు 1.91 లక్షల హెక్టార్లలో తగ్గిందని ,పంజాబ్ మరియు హర్యానా మినహా రాష్ట్రాలలో వరి నాట్లు పెరిగినప్పటికీ, మునుపటి సంవత్సరం సాకు విస్తీరణం తో పోల్చితే 1.91 లక్షల హెక్టార్ల క్షీణతను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఈ ఖరీఫ్ (వేసవి) సీజన్‌లో అదనంగా 0.43 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. పంజాబ్‌లో జూన్‌లో మరియు హర్యానాలో మే 15 తర్వాత విత్తనాలు విత్తడం ప్రారంభమవుతుంది.
గత సంవత్సరం ఇదే సమయానికి 29 లక్షల హెక్టార్లులో వరి సాగు జరగగా ఈ సంవత్సరం మీడియా నీవైదికల ప్రకారం కేవలం 27.89 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడిందని, ఈ సీజన్‌లో వరి నాట్లు వేసిన ప్రధాన రాష్ట్రాలు తెలంగాణ (4.77 లక్షలు), పశ్చిమ బెంగాల్ (7.90 లక్షలు), . (3.02 లక్షలు), తమిళనాడు (1.48 లక్షలు), కర్ణాటక (3.29 లక్షలు), మహారాష్ట్ర (1.64 లక్షలు), ఒడిశా (1.95 లక్షలు), గుజరాత్ (0.79 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (1.12 లక్షలు), ఛత్తీస్‌గఢ్ (0.56 లక్షలు), కేరళ (0.59 లక్షలు), జార్ఖండ్ (0.05 లక్షలు) మరియు బీహార్ (0.29 లక్షల హెక్టార్లలో సాగుజరిగిందని వెల్లడించింది .
ఈ సంవత్సరం దాదాపు 19.61 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగవగా, మధ్యప్రదేశ్ 9.64 లక్షల హెక్టార్లతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయానికి 18.44 లక్షల హెక్టార్లు సాగైంది. మినుములు , ముతక ధాన్యాల సాగు ఈ సంవత్సరం కొంతమేర పెరిగింది.
ఇది కూడా చదవండి .
భారీగా పెరిగిన జీలకర్ర ధర.. క్వింటాల్ జీరా రూ. 48,000..కారణం ఇదే
మధ్య ప్రదేశ్ తరువాత గుజరాత్ (3.25 లక్షల హెక్టార్లు), ఉత్తరప్రదేశ్ (2.82 లక్షల హెక్టార్లు), పశ్చిమ బెంగాల్ (1.34 లక్షల హెక్టార్లు), మహారాష్ట్ర (1.15 లక్షల హెక్టార్లులో చిరుధాన్యాలను సాగు చేసాయి . ఖరీఫ్ సీజన్‌లో అంతకు ముందు ఏడాది ఇదే సమయ వ్యవధిలో దాదాపు 10.85 లక్షల హెక్టార్లలో నమోదైంది.అదేవిధంగా ఈ సంవత్సరం 9.96 లక్షల హెక్టార్లలో నూనె గింజలు సాగు అయ్యాయి .
నూనె గింజల సాగులో లో పశ్చిమ బెంగాల్ (3.29 లక్షల హెక్టార్లు), గుజరాత్ (1.77 లక్షల హెక్టార్లు), ఉత్తరప్రదేశ్ (1.27 లక్షల హెక్టార్లు), మరియు మహారాష్ట్ర (1.11 లక్షల హెక్టార్లు). మంత్రిత్వ శాఖ ప్రకారం, గత ఏడాది ఇదే కాలంలో 11.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరగగా ఈ సంవత్సరం 11.73 లక్షల హెక్టార్ల విస్తీర్ణం లో సాగు జరిగింది .
Share your comments