News

రైతులకు ఉపయోగపడే యాప్‌లు ఇవే..

KJ Staff
KJ Staff

ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్‌లోకి వస్తుంది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో లాభాలెన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే ఉన్నాయి. టెక్నాలజీ ద్వారా ఏ పనైనా క్షణాల్లో జరిగిపోతోంది. ఇంటి వద్ద నుంచే అనేక పనులు చేసుకోగలుగుతున్నాం. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాయి.

' ప్రజలకు సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అధికారులకు లబ్దిదారులకు గుర్తించాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఆఫీసులోనే కూర్చోని ఏ పథకానికి ఎవరు అర్హలనే విషయాన్ని ఈజీగా తెలుసుకుంటున్నారు అధికారులు. ఇక ప్రజలు కూడా ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ పథకాలకు సులువుగా అప్లై చేసుకుంటున్నారు.

అయితే రైతులకు కూడా టెక్నాలజీ బాగానే ఉపయోగపడుతుంది. రైతులకు సమాచారం అందించేందుకు, అనుమానాలు నివృత్తి చేసేందుకు చాలా యాప్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. కొన్ని ప్రభుత్వ యాప్‌లు బాగా.. మరికొన్ని ప్రైవేట్ యాప్‌లు. ఇప్పుడు రైతులకు ఉపయోగపడే యాప్‌ల వివరాల గురించి తెలుసుకుందాం.

1. ఈ క్రాప్ బుకింగ్

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో నమోదు చేసుకుంటే మీరు ఏ పంట మీ పొలంలో వేశారు. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేశారనేది తెలుస్తుంది. అకాల వర్షాలు, తుఫాన్ ల వల్ల పంట నష్టపోయిన సమయంలో ప్రభుత్వం దగ్గర మీ సమాచారం ఉండటం వల్ల ఆర్థిక సహాయం చేయడానికి సులువుగా ఉంటుంది.

2. కిసాన్ సువిధ యాప్

ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాబోయే వారం రోజుల్లో వర్షం పడుతుందా.. వాతావరణం ఎలా ఉంటుంది అనే వివరాలు తెలుసుకోవచ్చు.
అలాగే సాగు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సమీపంలోని కమోడిటీల మార్కెట్ ధరలు, సంబంధిత పంటకు రాష్ట్రంలో ఉన్న గరిష్ట ధరలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

3. PLANTIX

క్రాప్ డాక్టర్ యాప్ ఇది. మీ పంటకు తెగులు పట్టినప్పుడు ఏం చేయాలి. ఎలాంటి మందులు వాడాలి. అలాగే పంటలకు సంబందించిన ఎలాంటి అనుమానాలనైనా ఈ యాప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on News

More