తీవ్ర ఉక్కపోత తో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కొంత మేర ఉపశమనాన్ని కల్గించింది .
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్ ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుఫాన్ వల్ల రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి .
పెను తుఫానుగా మారిన సైక్లోన్ 'మోచా'.. ఈ రాష్ట్రాల్లో హై అలెర్ట్
వాతావరణ శాఖ ప్రకారం, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాపై మోచా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అండమాన్ నికోబార్ దీవులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిక జారీ చేసింది. అదృష్టవశాత్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీరాలను తాకే తుఫాను ముప్పు ఇప్పుడు దాటిందని ఐఎండి కూడా పేర్కొంది. మోచా తుపాను ఈ నెల 14న బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దును దాటే అవకాశం ఉందని వాతావరణ సఖ తెలిపింది.
తీరానికి చేరుకునే సరికి గంటకు 150-175 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తరువాత, తుఫాను బలహీనపడి దక్షిణ అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మణిపూర్, మరియు నాగాలాండ్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాంతాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
Share your comments