News

సామాన్యులకు శుభవార్త చెప్పిన మోడీ ప్రభుత్వం.. త్వరలో తగ్గనున్న ధరలు..

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుండి బియ్యం వరకు అన్నిటి ధరలు భారీగా పెరికిపోయాయి. ప్రజలు ఈ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ధరలు అంతలా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో టమోటా, మిర్చి, అల్లం మరియు బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటాలు ఐతే ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ప్రస్తుతం దేశంలో గోధుమ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రించేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ, పెరుగుతున్న గోధుమ ధరలను పరిష్కరించడానికి దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశంతో సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని అన్నారు.

బియ్యం విషయానికొస్తే భూటాన్ నుంచి ఇప్పటివరకు 80,000 టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలని భారతదేశానికి ప్రభుత్వ స్థాయిలో వినతి పత్రం అందిందని ఆయన చెప్పారు. గోధుమల సరఫరాను నియంత్రించేందుకు మరియు పెరుగుతున్న రిటైల్ ధరలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం గత ఏడాది గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. గోధుమలు, పిండి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో గోధుమ నిల్వలను పిండి మిల్లులకు, ఇతర వ్యాపారులకు విక్రయిస్తోంది.

ఇది కూడా చదవండి..

నెల్లూరు: అమ్మఒడి నగదు స్వాహా చేసిన వాలంటీరు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

జూన్-జూలై 2021-22 వరకు పంట సంవత్సరానికి దేశ గోధుమ ఉత్పత్తి గత సంవత్సరం 109.59 మిలియన్ టన్నులతో పోలిస్తే, ఈ ఏడాది 107.74 మిలియన్ టన్నులకు తగ్గింది. పర్యవసానంగా, ప్రభుత్వ గోధుమల సేకరణ కూడా గణనీయమైన క్షీణతను చూసింది, అంతకుముందు సంవత్సరం 43 మిలియన్ టన్నులు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం 19 మిలియన్ టన్నులను మాత్రమే కొనుగోలు చేసింది.

ఇది కూడా చదవండి..

నెల్లూరు: అమ్మఒడి నగదు స్వాహా చేసిన వాలంటీరు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

Related Topics

central government

Share your comments

Subscribe Magazine

More on News

More