కృషి జాగరణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన MFOI, వివీఐఎఫ్ కిషన్ భరత్ యాత్ర, 11 ఫిబ్రవరి, 2024 నాటికీ పంజాబ్ లోని దౌలతాపుర కు చేరుకుంది. కృషి జాగరణ్ కలిపించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పంజాబ్ లోని రైతులు వారి సమస్యలని పంచుకున్నారు. కృషి జాగరణ్ టీం సభ్యులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న రైతులను గుర్తించి వారికీ చిరు సత్కారాలని అందించారు.
న్యూ ఢిల్లీ ఉజ్జవ కృషి కేంద్రం నుండి ప్రారంభం అయినా ఈ యాత్ర కార్యాక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర ద్వారా ఉత్తర భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ వారిని కొత్త ఆవిష్కరణల వైపు మొగ్గు చూపేలా జాగృతం చేస్తన్నారు. ఈ కార్యక్రమానికి రైతుల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ యాత్ర ద్వారా మొదటి సారి రైతులు MFOI(మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియ) అంటే ఏమిటి? దీని వాళ్ళ ఉపయోగాలు ఏమిటో సమగ్ర సమాచారాన్ని పొందుతున్నారు. రైతులకు వారి గొప్పతన్నాని తెలియచేయడానికి మరియు గుర్తింఫు పొందడానికి ఈ యాత్ర ఒక మంచి అవకాశం కలిపించింది. వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, కొత్త రకం పరికరాల గురించి సమాచారం , పంటను పీడించే రోగాల గురించి తెలుసుకుని వాటిని అరికట్టే మెళుకువలు తెలుసుకోవచ్చు.
సమస్యలు పంచుకున్న రైతులు:
ఈ రోజు యాత్రను పురస్కరించుకుని కృషి జాగరణ్ తరుపున పంజాబీ రైతు కపిల్ సింహ గారిని సన్మానించారు. కపిల్ సింహ మాట్లాడుతూ, వారి ప్రాంతం లో ఎక్కువ కమల ఫలాల పంట పండిస్తాం అని తెలిపారు. కానీ రెండు సంవత్సరాల నుండి వారి ప్రాంతంలోని రైతులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నాం అని చెప్పారు. ముఖ్యంగా పండిన పంటకు తగిన ధర రావట్లేదు అని ఇంకా చెట్లు అన్ని తరచూ రోగాల భారిన పడుతున్నాయి అని అయన చెప్పారు. అయితే కపిల్ సింహ నూతనం గ అలోచించి రోగాలను అరికట్టేందుకు వారి పొలం లో సాలీకేలే జాతికి చెందిన పోప్లర్ ట్రీ ని పెంచుతున్నారు. ఇతర రైతులు కూడా నష్టాన్ని అరికట్టేందుకు ఈ మొక్కలు పెంచాలి అయన సూచించారు.
Share your comments