News

గొర్రెల స్కీం లబ్ది దారులకు నేరుగా ఖాతాలో డబ్బులు .. జీవో విడుదల..

Srikanth B
Srikanth B

రాష్ట్ర వ్యాప్తం గ వున్నా గొర్రెల స్కీం లబ్ది దారులకు శుభవార్త తెలిపింది దళితబంధు తరహాలో లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేసి, తర్వాత యూనిట్లు పరిశీలించాలని నిర్ణయించింది . తొలుతగా యాదాద్రి ,నల్గొండ వ్యాప్తం గ వున్నా 7600 యూనిట్లకు గాను రూ.93.76 కోట్లు జిల్లా కలెక్టర్ అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేశారు. దీనిప్రకారం ఒక్కో యూనిట్ కు సుమారు రూ . రూ.1. 75 లక్షలు వరకు లబ్దిదారులకు లభించనున్నాయి.

రూ.1. 75 లక్షలు వరకు లబ్దిదారులకు లభించనున్నాయి . మేరకు అక్టోబర్ 1న ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డర్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం బయటకు వచ్చాయి. ఈ 7.600 మంది లబ్ధిదారులు మునుగోడు నియోజకవర్గానికి చెందినవాళ్లే.

NMMSS:నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ అంటే ఏమిటి ?

పైలెట్ ప్రాజెక్టుగా మునుగోడు..

గొర్రెల స్కీం కింద నగదు బదిలీ కోసం మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలిపి మొత్తం 7,600 మంది లబ్ధిదారులను అధికారులు ఫైనల్ చేశారు. ఒక్కో లబ్ధిదారు అకౌంట్లలో రూ.1. 75 లక్షలు బదిలీ అయ్యేలా కలెక్టర్ అకౌంట్లలోకి ఫండ్స్ రిలీజ్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారులు 12,661 మందికాగా.. మొదటి విడతలో 5,061 మందికి గొర్రెలు పంపిణీ చేశారు.

ఇప్పుడు రెండో విడతలో బ్యాలెన్స్ 7,600 మందికి గొర్రెలు ఇవ్వాలని నిర్ణయించారు. 2017లో స్కీం ప్రారంభంకాగా రాష్ట్ర వ్యాప్తంగా 7.61 లక్షల మంది లబ్ధిదా రులను గుర్తించి మొదటి విడతలో 3.88 లక్షల మందికి గొర్రెలు పంపి ణీ చేశారు. రెండో విడతలో 3.50 లక్షల మంది గొర్రెలు కోసం డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు.

NMMSS:నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ అంటే ఏమిటి ?

Share your comments

Subscribe Magazine

More on News

More