భారీ ఎండలు ,వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణశాఖ .. రానున్న రెండు మూడు రోజులలో రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి ,రుతుపవనాల రాకతో సంబంధం లేకుండా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతాహవారణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది .
సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని, ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణలోనికీ ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది . . మొత్తానికి రెండు, మూడు రోజుల్లో తెలంగాణను తొలకరి పలకరిస్తుందని రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త: రేపటి నుండే 'జగనన్న విద్యా కానుక'..
తెలంగాణాలో మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడంతో దిగువస్తాయిలోని గాలులు పశ్చిమదిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపింది.
Share your comments