గత వారం రోజులనుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి దీనితో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు . జూన్ మొదటి వారంలో ఎండలు ముగుస్తాయి అని భావించిన రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో మరిన్ని రోజులు ఎండలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది .
మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఏపీలోని రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడంతో రుతుపవనాలు గమనం నెమ్మదించినట్టు వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు .
మరోవైపు అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి .
ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా వరదరాజపురంలో 45, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!
ఇటు తెలంగాణలోకూడా 11 జిల్లాలకు వాతావరణ శాఖ వడగాల్పుల వీచే ప్రమాదంవుందని హెచ్చరికలు చేసింది. నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ అయ్యాయి .
Share your comments