ములుగు జిల్లా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ధ్వంసమైన అడవిని గురువారం ,అడవిశాఖ అధికారి CFO ప్రభాకర్ రావు పరిశీలించారు.
తాడ్వాయి మేడారం వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా 500 ఎకరాల్లో దట్టమైన అడవి ప్రాంతం బుధవారం ధ్వంసం అయ్యిది తీవ్రమైన గాలి కారణంగా వెలది చెట్లు నేలకొరిగాయి.
"నా38సంవత్సరాల సర్వీస్ లో ఇంతటి బీభత్సవం నేనెప్పుడూ చూడలేదు, విపత్తును స్టడీ చేయడానికి మెటాలజికల్ డిపార్ట్మెంట్.ఎన్ ఆర్ సిఐ .ఎక్స్పపర్ట్ పిలిపించి స్టడీ చేపిస్తాం భారీ ఎత్తున జరిగిన విధ్వంసపై స్పెషల్ రిపోర్ట్ తయారుచేసి గవర్నమెంట్ ఇండియాకు రిపోర్ట్ ఇస్తాం" అన్నారు అధికారులు .
తెలంగాణలోని ములుగు జిల్లా అడవులను బుధవారం నాడు టోర్నడో లాంటి గాలులు బలంగా వీయడం తో ములుగు జిల్లా మేడారం అడవుల్లోని 200 హెక్టార్ల అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలాయి.
ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్ రెడ్డి
విజువల్స్ భారీ ప్రకృతి వైపరీత్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ములుగు జిల్లా మేడారం-తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్టులో చెట్లు నేలకొరిగాయి.
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘటన జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
Share your comments