శ్రీకాకుళంలోని సున్నపల్లి సముద్ర ఒడ్డు వద్ద గత మంగళవారం ఓ బంగారు రథం ఒడ్డుకు చేరడం తెలిసిందే అయితే ఇప్పుడు అధికారులు దాని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారు రంగు రథం మయన్మార్ నుండి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు.మఠం ఆకారాన్ని, దానిపై ఉన్న శాసనాలను పోలి ఉండే ఈ నిర్మాణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అది మయన్మార్‌కు చెందినదని స్థానిక అధికారులు తెలిపారు.
'అసాని' తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్లకల్లోలం కారణంగా మంగళవారం సాయంత్రం సంతబొమ్మాళి మండలం సున్నపల్లి తీరంలో రహస్య రథం కొట్టుకువచ్చింది.కొంతమంది స్థానిక మత్స్యకారులు దానిని నీటిలో నుండి బయటకు తీశారు. అప్పటి నుండి అందరిని విస్మయానికి గురి చేసిన విషయం తెలిసినదే.
ఈ నిగూఢమైన బంగారు రథాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పరిస్థితిని అనియంత్రించడానికి మెరైన్ పోలీసులు ఆలయ రథాన్ని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి. లతాకర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అధికారి, మెరైన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఈ నిర్మాణాన్ని పరిశీలించారు. రథం పై రాసి ఉన్న లిపి మయన్మార్‌కు చెందినదని అధికారులు కనుగొన్నారు,ఇది బంగారు రథం కాదని, కేవలం బంగారు రంగు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే రథాన్ని గ్రామానికి దేవాలయంగా మార్చేందుకు అనుమతించాలని మత్స్యకారులతోపాటు స్థానికులు అధికారులను అభ్యర్థించారు.
మరిన్ని చదవండి
Share your comments