News

రైతు సంస్థలకు నాబ్ కిసాన్ రుణాలు: నాబార్డ్ చైర్మన్

KJ Staff
KJ Staff

విజయవాడలో నిన్న వారాహి రైతు ఉత్పత్తి సంస్థ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎఫ్‌పీవో డైరెక్టర్ల సమావేశంలో నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల, నాబ్‌ కిసాన్‌ ఎండీ సుశీల చింతల పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల మాట్లాడుతూ సరైన వ్యాపార ప్రణాళికలతో వస్తే ఎవరికైనా నాబార్డు ఆధ్వర్యంలోని నాబ్‌ కిసాన్‌ ద్వారా రుణాలు అందించి ఆర్థిక సాయం అందించే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంస్థలతో ఏర్పాటయ్యే సమాఖ్యలకు ఎలాంటి సాయం అందించాలనే విషయమై సరైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తామని చెప్పడం జరిగింది.

అలాగే బ్యాంకుల నుంచి రుణాల విషయంలో కొన్నేళ్ల కిందట పొదుపు సంఘాలకు ఎదురైన ఇబ్బందులే ఇప్పుడు రైతు ఉత్పత్తి సంస్థలకూ వస్తున్నాయని ,మన భూముల్లో సేంద్రియ కర్బన శాతం చాలా తగ్గుతోంది. ఇలాగే కొనసాగితే నేల సహజ స్వభావం చచ్చుబడిపోతుంది. 1960-70లో కిలో యూరియాతో 14 కిలోల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తే.. ఇప్పుడు కిలో యూరియాకు 1.1 కిలోలే వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రైతులకు ఈ సందర్భంగా నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల తెలియజేశాడు.

ఈ సమావేశంలో నాబ్‌ కిసాన్‌ ఎండీ సుశీల చింతల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రుణ మంజూరుకు ఎక్కువ అవకాశాలున్నాయి. రైతుల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా వచ్చే ఒకటి, రెండేళ్లలో మరిన్ని సంస్థలకు రుణం అందించేలా కృషి చేస్తాం అని .
రైతు ఉత్పత్తి సంస్థలకు తక్కువ వడ్డీకే రుణం అందిస్తామని నాబ్‌ కిసాన్‌ ఎండీ సుశీల చింతల తెలిపారు.వడ్డీ 9% ఉంటే అందులో 3% రాయితీ ఉంటుంది. రైతులకు 6% వడ్డీకే రుణం లభిస్తుంది కిసాన్‌ ఎండీ సుశీల చింతల తెలిపారు.

అలాగే పల్నాడులాగే ఉండే బుందేల్‌ఖండ్‌లో రైతుల వార్షికాదాయం గతంలో రూ.41వేలు ఉండేది. సమ్మిళిత వ్యవసాయ విధానంతో ఇప్పుడది రూ.3.50-4 లక్షల స్థాయికి పెరిగింది అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ పెరుగుతోంది. విజయవాడలోనే ఇప్పుడు 50 వరకు దుకాణాలు ఏర్పాటయ్యాయి అని గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఛైర్మన్‌ ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. భారతీయ కిసాన్‌సంఘ్‌ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు కుమారస్వామి, నాబార్డు సీజీఎం సుధీర్‌ కుమార్‌ జన్నావార్‌ తదితర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలు తెలియజేయడం జరిగింది.

Share your comments

Subscribe Magazine

More on News

More