News

కొత్త నక్షత్రాన్ని కనుగొన్న హబుల్ టెలిస్కోప్ భూమి నుండి ఎంత దూరంలో ఉందొ ఊహించలేరు.

S Vinay
S Vinay

హబుల్ టెలిస్కోప్ ఇప్పటివరకు చూడని అత్యంత సుదూరాన ఉన్న నక్షత్రాన్ని కనుగొన్నది ఈ నక్షత్రం నుండి వెలువడే కాంతిని సంగ్రహించింది. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ఈ అద్భుత విషయాన్నీ వెల్లడించింది.

కొత్తగా గుర్తించబడిన నక్షత్రం చాలా దూరంలో ఉంది, దాని కాంతి భూమిని చేరుకోవడానికి సుమారుగా 12.9 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని నాసా పేర్కింది.హబుల్ స్పేస్ టెలిస్కోప్‌ని ఉపయోగించి విశ్వంలోని కొన్ని సుదూర గెలాక్సీల కోసం శోధించే ప్రయత్నాల్లో భాగంగా ఈ అన్వేషణ జరిగింది .యాదృచ్చికంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆ గెలాక్సీలలో ఏరెండల్ అనే నక్షత్రాన్ని గుర్తించగలిగారు.పరిశోధనా బృందం ప్రకారం, ఎరెండెల్ సూర్యుని ద్రవ్యరాశి కంటే కనీసం 50 రెట్లు మరియు మిలియన్ల రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. మనకి ముందే తెలిసిన అత్యంత భారీ నక్షత్రాలకు మించి దీని పరిమాణం ఉంటుంది అని పేర్కొన్నారు.

నాసా పరిశోధన బృందం ఇంకా మాట్లాడుతూ, గత రికార్డును ఈ ఎరెండెల్ నక్షత్రం తుడిచివేసిందని 2018లో హబుల్ ఒక నక్షత్రాన్ని గుర్తించింది. ఆ నక్షత్రం విశ్వం సుమారు 4 బిలియన్ సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఉనికిలోకి వచ్చిందని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.

హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి తెలుసుకోండి.
దీనికి ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ యొక్క పేరును పెట్టారు.

ఇది ప్రారంభించినప్పటి నుండి ఖగోళ శాస్త్ర రంగంలో సంచలనాత్మక ఆవిష్కరణలు చేసింది .

ఇది " గెలీలియో టెలిస్కోప్ తర్వాత ఖగోళ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది" గా పేరు గాంచింది.

ఇది సైజులో స్కూల్ బస్సు కంటే పెద్దది (13.3 మీటర్లు)

మరిన్ని చదవండి.

TELANGANA:పొలానికి దిష్టి ఇలా కూడా తీస్తారా ఈ రైతు ఏం చేసాడో చూడండి.

Related Topics

nasa hubble telescope galaxy

Share your comments

Subscribe Magazine

More on News

More