నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (national statistics office) అఖిల-భారత గృహ వినియోగదారుల వ్యయ సర్వేను నిర్వహించనుంది.
సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (national statistics office) నిర్వహించే అఖిల-భారత గృహ వినియోగదారుల వ్యయ సర్వే (The All-India Household Consumer Expenditure Survey) సుదీర్ఘ విరామం తర్వాత ఈ సంవత్సరం పునఃప్రారంభించబడుతుంది.
ఈ సర్వే 2022 జూలై నుండి ప్రారంభమై జూన్ 2023 నాటికి పూర్తవుతుంది. ఈ సర్వేలో ముఖ్యంగా ఇంటి నెలవారీ వినియోగదారుల తలసరి వ్యయం ఆహారం మరియు ఆహారేతర సగటు వ్యయాన్ని వెల్లడిస్తుంది.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేక డేటా సెట్‌లను కలిగి ఉంటాయి మరియు ప్రతి రాష్ట్రం మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు అలాగే విభిన్న సామాజిక-ఆర్థిక సమూహాలకు సంబంధించిన వ్యయ విధానాలను కూడా కలిగి ఉంటాయి.
త్వరలోనే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని కుటుంబాలతో డేటా సేకరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి దీని కొరకై ఫీల్డ్ ఎన్యూమరేటర్లు శిక్షణా కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంది.వాస్తవానికి ఈ సర్వే 2020 వ సంవత్సరం లో జరగాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సర్వే ప్రారంభించలేకపోయామని అధికారలు తెలిపారు.
2011 సర్వే వివరాలు:
దేశంలోని సగటు గ్రామీణ నెలవారీ తలసరి ఖర్చు రూ. 1,430,సగటు పట్టణ ప్రాంత నెలవారీ తలసరి ఖర్చు రూ. 2,630, గ్రామీణ ప్రాంతాలతో పరిగణిస్తే పట్టణ ప్రాంతాలలో దాదాపు 84% ఎక్కువగా ఉంది.గ్రామీణ కుటుంబ సగటు వ్యయంలో విద్య 3.5% వాటాను కలిగి ఉంది.
మరిన్ని చదవండి
Share your comments