ప్రకృతి ప్రేమికుడు,భారతీయ ప్రకృతి వ్యవసాయ పితామహులు డా. సుభాష్ పాలేకర్
ఇతడు అభివృద్ధి పరచిన వ్యవసాయ పద్ధతికి పాలేకర్ విధానము.గా ప్రాచుర్యము పొందినది. ఇదే ప్రకృతి వ్యవసాయం. సుభాష్ పాలేకర్ గారు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అనబడే శాస్త్రబద్ధమయిన వ్యవసాయ పద్ధతిని 1998 లో రూపొందించారు. హరిత విప్లవం వల్ల భూమిలో విషపదార్ధాలు పెరుగుతాయని నిరూపించి,ప్రకృతి వ్యవసాయం పద్ధతిని రైతులకు ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్నారు.
రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి.అవి బీజామృతం జీవామృతం,అచ్చాదన, వాఫ్స ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధ రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకొవాలి.
అధిక దిగుబడులు సాధించాలని లక్ష్యంతో విచ్చలవిడిగా పురుగుమందులు, కృత్రిమ ఎరువులు వాడటంతో భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి తీసుకెళ్లాం.ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రీయ వ్యసాయంవైపు వెళ్ళేలా చేశాయి.
భారతీయ ప్రకృతి వ్యవసాయ పితామహులు డా. సుభాష్ పాలేకర్ "తిరిగి ప్రకృతిలోకి" సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ ,అక్టోబర్ నెలల్లో తన యూట్యూబ్ ఛానల్‌లో 5 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, ఔషధాలతో పనిలేని మానవ జీవనం, ఆధ్యాత్మిక జీవన విధానం,సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయదారులు, వినియోగదారులంతా ఒకే కుటుంబం. తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సెప్టెంబర్ 12, 26 తేదీలు,అక్టోబర్ 3, 10,17 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, 6 గంటల పాటు శిక్షణ ఇస్తారు. పాలేకర్ వాట్సప్ నంబరు: 98503 52745. ఇతర వివరాలకు అమిత్ పాలేకర్ - 96731 62240 మొబైల్ నెంబర్ ద్వారా ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Share your comments