కేంద్ర ప్రభుత్వం తాజాగా రిటైర్డ్ ఉద్యోగులకు కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఇకనుండి పదవీ విమరణ చేసిన ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తీవ్రమైన నేరం లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించినట్లయితే, ఆ ఉద్యోగి పెన్షన్ ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ చర్య పదవీ విరమణ చేసినవారు ఉన్నత ప్రమాణాలు మరియు నీతి, చట్టానికి కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం మరియు ఏ విధమైన తప్పులను చేయకుండ ఉండటానికి ప్రభుత్వం తీసుకుంది. ఈ పెన్షన్ నిలిపివేత అనేది ఈ ఉద్యోగి చేసిన నేర తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లేదా భద్రతా సంబంధిత సంస్థ నుండి పదవీ విరమణ చేసినట్లయితే, వారి మునుపటి పనికి సంబంధించిన ఏదైనా మెటీరియల్‌లను ప్రచురించే ముందు తప్పనిసరిగా సంబంధిత సంస్థ నుండి అనుమతి పొందాలి. జాతీయ భద్రతకు సంబంధించిన ఎలాంటి రహస్య సమాచారం తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా మరియు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఈ చర్యను ఏర్పాటు చేశారు.
అటువంటి సంస్థల నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఏదైనా మెటీరియల్‌లను ప్రచురించకుండా ఉండవలసి ఉంటుంది. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే ఈ ఉద్యోగుల పెన్షన్‌ను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి..
భారీగా తగ్గిన నూనె ధరలు.. కొనేందుకు ఎగబడుతున్న జనాలు..
జులై 6 నుండి కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్-కమ్-రిటైర్మెంట్ బెనిఫిట్) రూల్స్ 1958ని సవరించారు. కాబట్టి, ఈ కొత్త నిబంధనను ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్-కమ్-రిటైర్మెంట్ బెనిఫిట్స్) సవరణ నియమాలు, 2023 అని పిలుస్తారు.
ఈ ముఖ్యమైన సవరణ ఆల్ ఇండియా సర్వీసెస్‌లో సేవలందిస్తున్న వ్యక్తులకు అందించే ప్రయోజనాలలో మార్పులు మరియు మెరుగుదలలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, సవరించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయి, పెన్షన్ పొందేందుకు అర్హులైన కుటుంబ సభ్యుడు హత్య లేదా సదరు ఉద్యోగి హత్యకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చినట్లయితే, కుటుంబ పెన్షన్ మంజూరు చేయబడదు.
అలాగే, సవరించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వోద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షన్‌కు అర్హులైన వ్యక్తి ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన, హత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపినట్లయితే ఆ కుటుంబానికి పెన్షన్ చెల్లించబడదు. మరణించిన ప్రభుత్వోద్యోగి కుటుంబంలోని అటువంటి సభ్యునిపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లు పెండింగ్‌లో ఉన్నందున మరణించిన ప్రభుత్వోద్యోగి కుటుంబంలోని అర్హతగల మరొక సభ్యునికి కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments