New Driving licence rules: కారైనా, బండైనా, వాహనం ఏదయినా లైసెన్స్ ఉంటేనే రోడ్డుపై ప్రయాణించేందుకు అర్హులవుతారు. ఒక వేళ లైసెన్స్ లేకుండా బండి తీస్తే.. అది శిక్షార్హమైన నేరం. అయితే లైసెన్స్ తీసుకోవడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారం అని చాలా మంది భావన.ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి.. గంటల తరబడి క్యూలలో నిలబడాలి..టెస్ట్ డ్రైవ్ చేయాలని అని భావిస్తూ ఉంటారు. అయితే వారి కోసం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది.
ఇకపై ఇలాంటి అవస్థలు ఏవి పడకుండా సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కొత్త రూల్స్ రానున్నాయి .
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్:
కొత్త నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ టెస్ట్ కోసం..ఆర్టీవో కార్యాలయాల వద్ద క్యూలలో గంటల తరబడి నిలబలడాల్సిన పని లేదు. ఆర్టీవో కార్యాలయం వద్దే టెస్ట్ డ్రైవ్ చేయక్కర్లేదు. అందుకు బదులుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ వద్దకు వెళితే చాలు. దాంతో లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి సమయం కలిసి రానుంది.
అవును ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇకపై లైసెన్స్ కోరుకునే వారు ఆర్టీవో కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు . కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్లను సంప్రదిస్తే సరిపోతోంది. ఐదేళ్లకు ఒకసారి ఆ డ్రైవింగ్ సెంటర్లకు ప్రభుత్వాలు లైసెన్సులు ఇస్తాయి. వాటిని రెన్యూ చేయించుకోవాల్సి ఉంటుంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన: 2700 మంది రైతులకు డబ్బు రికవరీ నోటిసు !
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకునే విధానం ?
https://transport.telangana.gov.in/html/driving-licence.html
రవాణా శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
అక్కడ రాష్ట్రం ఏదో ఎంచుకోవాలి.
ఏ రకమైన లైసెన్స్ కావాలాలో ఎంపిక చేసుకోవాలి
దరఖాస్తు నింపిన తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి
ఒకసారి అప్లికేషన్ ఆన్‌లైన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మెయిల్ ద్వారా లర్నర్ లైసెన్స్ వస్తుంది. ఆరు నెలల తర్వాత లైసెన్స్ మంజూరు చేస్తారు.
Share your comments