News

ఇకపై సూక్ష్మ రుణాలు రూ.2 లక్షలకు మించి తీసుకోవడం కుదరదు....

KJ Staff
KJ Staff

చాలా మంది ప్రజలు, చిన్న చిన్న అవసరాల కోసం కొద్దీ పాటి రుణాలను తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి రుణాలను సూక్ష్మ రుణాలని వీటిని జారీచేసే సంస్థల్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలని పిలుస్తారు. పెద్ద రుణాలతో పోలిస్తే సూక్ష్మ రుణాల కాలపరిమితి తక్కువుగా ఉంటుంది, అంతేకాకుండా ఈ రుణాలను వేగంగా జారీచెయ్యడటంతో చాలా మంది వారి అవసరాల కోసం వీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాల మైక్రో ఫైనాన్స్ సంస్థలు నిబంధనలకు అతీతంగా రుణాలను జారీచేయడం ద్వారా వాటిని తీసుకుంటున్న సాధారణ ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండి ఎక్కువుగా రుణాలు తీసుకుంటున్న ప్రజలు వాటిని తీర్చలేక పోవడంతో, మొండి బకాయిలు ఎక్కువైపోతున్నాయి. ఈ పరిస్థితులపై ద్రుష్టి సారించిన పరిశ్రమ సంగం ఎంఫిన్ (మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ) వీటిని నియంత్రించే విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తుంది. దేశంలోని మైక్రో ఫైనాన్స్ సమస్థలన్నిటికి ఎంఫిన్ నియంత్రిస్తుంది, మైక్రో ఫైనాన్స్ సంస్థలు పాటించవలసిన నియమాలు, మరియు వాటికి సంబంధించిన నిబంధనలు అన్ని ఎంఫిన్ సంస్థ నియంత్రణలో ఉంటాయి. ఈ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు అతిక్రమిస్తే వాటిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటుంది.

ఎంఫిన్ సంస్థ తాజాగా విడుదల చేసిన కొన్ని మార్గదర్శకాల ప్రకారం, ఇక నుండి సూక్ష్మరుణ సంస్థలు ఒక వ్యక్తికి రూ. 2 లక్షలకంటే ఎక్కువ రుణాలను ఇవ్వకూడదు. అలాగే ఒక వ్యక్తికి 1 నుండి 4 మైక్రో ఫైనాన్స్ సంస్థలు మాత్రమే రుణాలు ఇవ్వాలి, ఈ మొత్తం రెండు లక్షల రూపాయలకు మించకూడదు. ఈ నిబంధనను దేశంలోని అన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు పాటించాలని ఎంఫిన్ స్పష్టం చేసింది. ఈ పరిమితులను అమలుచేయడం ద్వారా రుణాలు పొందినవారు అప్పుల భారిన పడకుండా ఉంటారని అలాగే మొండి బకాయిల శాతం కూడా తగ్గుతుందని ఎంఫిన్ సంస్ధ భావిస్తుంది.

సాధారణంగా సూక్ష్మ రుణాలను తిరిగి చెల్లించడానికి 18-24 నెలల కాలవ్యవధి ఉంటుంది. ఈ కాలవ్యవధి దాటినా సరే రుణాలు తిరిగి చెల్లించనివారిని మొండిబకాయిలుగా పరిగణిస్తారు. ఈ కొత్త నిబంధనల మూలంగా మోడీ బకాయిల శాతం తగ్గుతుందని భావిస్తున్నారు. రుణాలను మంజూరు చేసేముందు రుణగ్రస్తుడి ఆదాయం, ఖర్చులు మరియు తిరిగి చెల్లించగలిగే సామర్ధ్యం అన్నిటిని పరిగణించి ఆ తరువాతే రుణాలు మంజూరు చెయ్యాలని ఎంఫిన్ సంస్థ సూక్ష్మ రుణ సంస్థలకు సూచించింది. దీనికి అనుగుణంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తమ సామర్ధ్యాని మరియు సమాచార నాణ్యతను పెంచాలని సూచించింది.

సూక్ష్మరుణ సంస్థలు దీర్ఘకాలం మనుగడలో ఉండటం మరియు స్థిరత్వాన్ని కాపాడటం కోసం, బాధ్యతారహితంగా రుణాలను మంజూరు చెయ్యడం చాలా అవసరం. గత రెండు దశాబ్దాల నుండి ఈ సంస్థ ఎంతగానో విస్తరించింది, మొత్తం 7.8 కోట్ల మంది వినియోగదారులతో, రూ. 4.33 లక్షల కోట్ల రుణాలను జారీచేసింది. దాదాపు 3 లక్షల రూపాయిల వార్షికాదాయం కలిగిన కుటుంబాలు, సూక్ష్మ రుణ సంస్థలకు వినియోగదారులుగా ఉంటున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More