కేంద్రం ప్రేవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం 2020 ఒక సరైన పద్దతిలో వినియోగించుకుంటే రైతుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా వ్యవసాయం ద్వారా దేశానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది అని ప్రముఖ మేనేజిమెంట్, కన్సల్టింగ్ ఏజెన్సీ అయిన BAIN (బైన్) వెల్లడించింది.
ఈ చట్టం ద్వారా కొత్త సాగు పద్దతులు, సాంకేతికతలో అభివృద్ధి జరిగి పాత విధానాలు నవీనికరించబడి సాగుబడి వేగం పుంజుకోవడం జరిగి దాని ఫలితంగా అగ్రి టెక్ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకు వస్తాయి అని, దాని ఫలితంగా ఒక డాలర్ గా అగ్రిటెక్ పెట్టుబడులు 2025 నాటికి 30 నుండి 35 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
భారీ పెట్టుబడుల కారణంగా వ్యవసాయ రంగంలోని వ్యవసాయ ఉత్పత్తులు, వాటి రవాణా, అమ్మకం మరియు కొనుగోలు లాంటి అన్నీ రంగాలలో మార్పులకు వీలు ఏర్పడి సమగ్ర వ్యవసాయ వేదికలు, ఇంక్యుబేషన్ విభాగాలు, కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు రాబోయే రోజుల్లో అమ్మకం కొనుగోలు మరింత విస్తృతంగా జరిగి రైతుల ఆదాయం రెండింతలు అవుతుంది అని పేర్కొంది.
ఈ అభివృద్ధి విధానాల వల్ల కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్న స్టార్ట్అప్స్ కి ఈ చట్టం మంచి వెసులుబాటు కలిగించింది అని BAIN వెల్లడించింది. ఇలా ఒకపక్క ఈ చట్టానికి వ్యతిరేకంగా రైతుల ఉద్యమాలు జరుగుతున్న సమయంలో BIAN ఈ సంచలన ప్రకటనలు చేసింది.
Share your comments