రైతుల ప్రతిఒక్కరికీ గేదెలు ఉంటాయి. వీటిని తమ ఇంటి మనుషులుగా రైతులు అంత ప్రేమగా చూసుకుంటారు. వీటి పాల ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోతాయి. ఒక్కొక్కసారి పంట నష్టపోయి దిగుబడి రాని సమయంలో పలు అవసరాలకు పాల విక్రయం ద్వారా వచ్చే డబ్బులు ఉపయోగపడతాయి. అందుకే రైతులు పాడి ద్వారా కూడా మంచి ఇన్ కమ్ లభిస్తోంది. అందుకే రైతులందూ గెదెల పెంపకం వైపు మోగ్గు చూపుతున్నారు.
అయితే పాడి రైతులకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతూ ప్రోత్సహిస్తున్నాయి. పాడి రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు, బోసస్ లాంటివి ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా పాడి రైతులకు జీవిత బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దాని పేరే ప్రధానమంత్రి శ్రమయోగి మన్‌ధన్. దీనిని సింపుల్‌గా పీఎం ఎన్‌వైఎం అంటారు.
కేంద్ర పశుసంవర్థక, కార్మికశాఖలు, పాడి పారిశ్రామికాభివృద్ధి మండలి సంయుక్తంగా కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎల్‌ఐసీతో భాగస్వామం అయి పాడి రైతులకు జీవిత బీమా అందిస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా కొన్ని నిబంధనలు మార్చారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అనేక మార్పులు చేసింది.
ప్రీమియంను రైతుల నుంచి పాలు కొనే సహకార, డెయిరీలే చెల్లించాలని కేంద్రం పీటముడి వేసింది. అయితే డెయిరీలు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. 60 ఏళ్లు వచ్చేంతవరకు తాము చెల్లించలేమని, రైతులే చెల్లించేలా నిబంధనలు ఉంటాయని డెయిరీ సంఘాలు కోరుతున్నాయి.
ఇక డెయిరీలు కూడా కొన్ని నిబంధనలు పెట్టాయి. పదేళ్లుగా పాలుపోసేవారే అర్హులని, రైతు వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి నిబంధనలు పెట్టాయి. ఏడాదిలో కనీసం 180 రోజులు డెయిరీకి పాలు పోయాలి. ఇక ఏడాది మొత్తంమీద వెయ్యి కిలోలు పాలు పోస్తే.. రైతుతో పాటు అతనడి భార్యకు కూడా ప్రీమియం చెల్లించాలి.
60 ఏళ్ల వరకు కడితే.. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల చొప్పున పించన్ ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. రైతు అకస్మాత్తుగా మరణిస్తే అతని భార్యకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తారు. ఒకవేళ మధ్యలో ప్రీమియం ఆపేస్తే అప్పటివరకు కట్టిన డబ్బులను చెల్లిస్తారు.
Share your comments