దేశంలో ఎవరు పస్తులు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకం ద్వారా దేశంలోని పేదలకు రేషన్ కార్డు ద్వారా ఆహార ధాన్యాలను ,నిత్యావసర వస్తువులను అందిస్తుంది . పథకం తప్పు ద్రోవ పట్టకుండా మరింత పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆధార్ -రేషన్ కార్డుల అనుసంధానం ప్రక్రియను ప్రారంభించింది ఇప్పటికే ఈ ప్రక్రియ చివరి తేదీ మార్చి నెలలో ముగియడంతో మరో సారి తేదీని జూన్ 30 కు పొడిగించింది .
ఇప్పటికి చాలా వరకు లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను - ఆధార్ తో లింక్ చేసుకోలేదు వీరికి పౌర సరఫరాల శాఖ చివరి హెచ్చరికను జారీ చేసింది జూన్ 30 తేదీలోపు రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే లబ్దిదారులకు రేషన్ కార్డు ద్వారా లభించే అన్ని సేవలు నిలిపియేయనున్నట్లు కేంద్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది .
ఇది కూడా చదవండి .
గుడ్ న్యూస్: భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..
డూప్లికేట్ రేషన్ కార్డులు పుట్టుకొస్తూ ఉండడంతో ఇలాంటి అనుసంధానం చేయడం వల్ల మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది .ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ నిబంధనలకు అనుకూలంగానే కొత్త దరఖాస్తులను స్వీకరిస్తూ కొత్త రేషన్ కార్డును అమలు చేస్తున్నారు. ఆహార భద్రత పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేయడానికి అక్రమ లబ్దిదారులను గుర్తించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది ఎప్పటికి ఎవరైనా దరఖాస్తు తమ ఆధార్ ను రేషన్ తో లింక్ చేయనట్లయితే లింక్ చేసుకోవడం ఉత్తమం లేదంటే తరువాత ఇబ్బందులు ఎదురుకోవాల్సివుంటుంది .
ఇది కూడా చదవండి .
Share your comments