News

జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌... మారే కీలక అంశాలు ఇవే ?

Srikanth B
Srikanth B
జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌... మారే కీలక అంశాలు ఇవే ?
జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌... మారే కీలక అంశాలు ఇవే ?

భానుడి భగ భగలు .. అకాల వర్షాలు , భిన్న వాతావరణం మధ్య మే నెల ముగిసింది . రేపటినుంచి కొత్త నే జూన్ ప్రారంభమ కానుంది ఒక విధంగా చెప్పాలంటే వర్షాలకాలం లో అడుగుపెట్టబోతున్నా అయితే ప్రతి నెలలో కొన్ని రూల్స్ మారుతూవుంటాయి అలాంటిది జూన్ నెలలో కూడా కొన్ని కొత్త రూల్స్ రానున్నాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం !

జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే !

జూన్ మొదటివారం లో నిత్యావసర వస్తువలనుంచి ఆర్థిక లావాదేవీలవరకు కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి .. వినియోగదారులు వాటిని ముందుగా తెలుసుకోవడంద్వారా జాగ్రత్త వహించవచ్చు .

ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌:
ఆధార్ కార్డు ఉన్న వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ పథకాలకు అన్ని రకాల లావాదేవీలకు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడే ఒకే ఒక పత్రం ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు జారీ చేసి చాలా సంవత్సరాలు గడిచిన నేపథ్యం లో ప్రభుత్వం ఆధార్ కార్డును అప్డేట్ ఉచితంగా చేసుకునే వెసులుబాటును కల్పించింది . ఆధార్ కార్డు అప్డేట్ కు ప్రభుత్వం విధించిన గడువు జూన్ 14 తేదీతో ముగియనుంది .

రేషన్ ఆధార్ లింక్ :

ఇప్పటికి చాలా వరకు లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను - ఆధార్ తో లింక్ చేసుకోలేదు వీరికి పౌర సరఫరాల శాఖ చివరి హెచ్చరికను జారీ చేసింది జూన్ 30 తేదీలోపు రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే లబ్దిదారులకు రేషన్ కార్డు ద్వారా లభించే అన్ని సేవలు నిలిపియేయనున్నట్లు కేంద్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది .

గ్యాస్ ధరలు:

ప్రతీ నెల 1వ తేదీన చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ఉంటాయి. అయితే, ధరలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదంటే స్థిరంగా ఉంచవచ్చు. గత నెల వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గించాయి.జూన్ 1 నుంచి కూడా గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు రానున్నాయి .

జూన్ 1 నుంచి ఎలక్ట్రిక్ వాహనల సబ్సిడీ లో కోత :

ఎలక్ట్రిక్ వాహనల వినియోగాన్ని పెంచాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనల పై గరిష్టంగా 40 శాతము సబ్సిడీ అందించింది . జూన్ 1 నుంచి ఎలక్ట్రిక్ వాహనల సబ్సిడీ ను 15 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం . ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలపై ప్రస్తుతం KWhకి రూ.15 వేలు నుంచి KWhకి రూ.10 వేలకు తగ్గించింది.

బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ లు వారి కుటుంబాలకు :

గత చాల సంవత్సరాలుగా చాల బ్యాంకులలో ఫిక్సడ్ డిపాజిట్ ,ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌ చేసి క్లెయిమ్‌ చేసుకోని వారి నామినీలను లేదా కుటుంబసభ్యులను గుర్తించి డబ్బులను అందించడానికి RBI లక్ష్యంగా పెట్టుకుంది .

గుడ్ న్యూస్: భారీగా పెరగనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine

More on News

More