News

New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. వచ్చే నెల నుంచి మారె కీలక అంశాలు ఇవే !

Srikanth B
Srikanth B

సెప్టెంబర్ నెల ఇంకా 4 రోజులలో ముగియనుంది దీనితో అక్టోబర్ నెలలో మారనున్న కొన్ని కొత్త నియమాలను తెలుసుకుందాం. అక్టోబర్ 1 నుంచి ఏ మరీనా కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి .

మొదటిది :
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ నియమ నిబంధనలు మారాయి . ఒకటో తేదీ నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్‌లో చేరడానికి వీలుండదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికం గ వెల్లడించింది.

రెండోవది :
అక్టోబర్ 1 నుంచి RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియ) సైబర్ నేరాలను నిర్ములించేందుకు తీసుకువచ్చిన నియమాలు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే వారికీ వర్తించనున్నాయి. దీని వల్ల కార్డు దారుల సమాచారం మరింత భద్రంగా ఉంటుంది.

మూడవది :
గ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారే విషయం మనకు తెలిసిందే. అయితే ఈసారి ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గొచ్చే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే పండుగ సీజన్‌లో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

నాల్గవది :
ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు ఈ నెల చివరితో ముగిసిపోనుంది. అందువల్ల వచ్చే నెలా నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. కస్టమర్లు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరాంటే ఇప్పుడే చేరొచ్చు.

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు అవకాశం:వాతావరణ శాఖ హెచ్చరిక !

ఐదవది :
మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టేవారు వచ్చే నెల నుంచి ఇన్వెస్టర్లు కచ్చితంగా నామినీ వివరాలను అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ వివరాలు ఇవ్వకపోతే డిక్లరేషన్ అయిన ఇవ్వాలి.
ఆరు :
అంతేకాకుండా ఐడీబీఐ బ్యాంక్ కూడా ఇదే దారిలో నడుస్తోంది. ఈ బ్యాంక్‌కు చెందిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కూడా వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండదు. ఈ నెల చివరి వరకే గడువు ది. అందువల్ల కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాల కు అవకాశం:వాతావరణ శాఖ హెచ్చరిక !

Related Topics

New Rules October 1

Share your comments

Subscribe Magazine