రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటను ఎన్నో కష్టాలని ఎదుర్కొని మార్కెట్ కి తరలిస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి హర్యానా ప్రభుత్వం రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.
ఈ నూతన విధానంలో రైతులు పండించే వరి,జోవార్, బజ్రా, మొక్కజొన్న, మూంగ్, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం రూపొందించిన "మేరి ఫసల్ మేరా బయోరా" పోర్టల్‌లో రైతులు తప్పనిసరిగా తమ పంటను నమోదు చేసుకోవాలి.లేకుండా రైతులు పండించిన పంటను ప్రభుత్వ నిర్ణయించిన రేటుకు విక్రయించలేరు.రైతులు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికిఆగస్టు 31న చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులు మెరి ఫసల్ మేరా బయోరా పోర్టల్లో తమ పంటలను రిజిస్టర్ చేసుకోవడం వల్ల కనీస మద్దతు ధర లభించడంతోపాటు,విత్తన సబ్సిడీ, వ్యవసాయ రుణం,వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ,పురుగు మందులు, ఎరువుల సబ్సిడీ, పంట బీమా వంటివి అర్హులైన ప్రతి రైతుకు సక్రమంగా అందజేయడానికి వీలు కలుగుతుంది.
రైతులందరి పంట వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నందున రైతుల మొబైల్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా నిర్ణయించిన సమయానికి మార్కెట్ కి వెళ్లి తమ పంటను అమ్ముకోవచ్చు. ఈ విధానం వల్ల రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు కాసే శ్రమ తగ్గుతుంది.
అదేవిధంగా రైతుల మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకొని ఉండడం వల్ల ప్రస్తుత మార్కెట్ ధర, కోత సమయం వంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం మెసేజ్ ద్వారా సకాలంలో రైతులకు పంపడం జరుగుతుంది. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ నూతన విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.
Share your comments