News

విజృంభిస్తున్న కొత్త వైరస్‌ టొమటో ఫ్లూ, .. కేరళ, ఒడిశాల్లో కలకలం

Srikanth B
Srikanth B

భారతీయ చిన్నారుల్లో హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌ (హెచ్‌ఎఫ్‌ఎండి) లేదా టొమాెెటో ఫ్లూ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని, ఇది అత్యంత తీవ్రమైన అంటువ్యాధని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ రెస్పిరేటరీ టొమాటో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుందని స్టేజ్ 4 కరోనావైరస్ ఉన్న పిల్లలను హెచ్చరిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలో ఐదేళ్లలోపు పిల్లలలో 82 టొమాటో ఫీవర్ కేసులు నమోదయ్యాయి మరియు ఈ ఏడాది మే 6న కేరళలోని కొలమ్‌లో మొదటి టమోటా జ్వరం కేసు నమోదైంది. ఈ వైరస్ పెద్దవారిలో చాలా అరుదుగా ఉన్నట్లు కనుగొనబడింది అని ప్రచురించింది .

అగ్రి జర్నలిస్టుగ మరలనుకుంటున్నారా ? కృషి జాగరణ్ తో చేతులూ కలపండి ..

వ్యాధిగ్రస్తుల శరీరంపై మొదట చిన్న సైజు ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడి క్రమంగా అది టొమాెెటో సైజులో పెరుగుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు ప్రధానంగా అలసట, కీళ్ల నొప్పులు, పొట్ట నొప్పి లేదా లుంగలు చుట్టుకు పోవడం, వాంతులు, డయేరియా, దగ్గు, ముక్కుదిబ్బడం, అధిక జ్వరం, నొప్పుల వంటి చికెన్‌గున్యా లక్షణాలు ఉంటాయని ఆ కథనంలో తెలిపింది. ఈ ఫీవర్‌కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని, ఈ వ్యాధి కేరళ, ఒడిషా, తమిళనాడు రాష్ట్రాల్లోని చిన్నారులకు నమోదైనట్లు లాన్సెట్‌ జర్నల్‌ వెల్లడించింది.

ఊదా క్యాబేజీ యొక్క అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine

More on News

More